అల్లుడికి అల్లరోడికి డెడ్ లైన్.. రూ.2కోట్లు తెచ్చారంటే..

టాలీవుడ్ లో ఈ సంక్రాంతి కొంతమంది హీరోలకు బాగానే కలిసొచ్చింది. బయటవాడైన విజయ్ మాస్టర్ సినిమాతోనే తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్నాడు. ఇక క్రాక్ తో మాస్ రాజా బాక్సాఫీస్ వద్ద ఆఫ్ సెంచరీ కొట్టి కెరీర్ బెస్ట్ హిట్ అందుకోగా రామ్ పోతినేని రెడ్ సినిమా 4కోట్లతో మొత్తానికి ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేశాడు.

ఇక సంక్రాంతిని నమ్ముకొని అల్లుడు అదుర్స్ తో వచ్చిన బెల్లంకొండ వారసుడు ఇంకా టార్గెట్ ను ఫినిష్ చేయలేదు. ఇక ఆ తరువాత వచ్చిన అల్లరి నరేష్ బంగారు బుల్లోడు సినిమా పరిస్థితి కూడా అలానే ఉంది. ఈ రోజుతో ఆల్ మోస్ట్ హాలిడేస్ ముగిసినట్లే. మళ్ళీ పరిక్షల కాలం మొదలవుతుంది. జనాలు థియేటర్స్ కు రావడం కష్టమే అని చెప్పవచ్చు.

అయితే ఈ రోజు జనవరి 26 హాలిడే కాబట్టి ఎంతో కొంత కలెక్షన్స్ రావచ్చు. బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9.8కోట్లు. అయితే ఇంతవరకు సినిమా 7.55కోట్లను మాత్రమే రాబట్టింది. ఇక అల్లరి నరేష్ బంగారు బుల్లోడు బ్రేక్ ఈవెన్ టార్గెట్ 3.5కోట్లు మాత్రమే. కానీ సినిమా ఇంకా 2కోట్ల షేర్స్ ను కూడా అందుకోలేదు. ఈ రెండు సినిమాలు ప్రాఫిట్ జోన్ లోకి రావాలి అంటే దాదాపు మరో రెండు కోట్లను రాబట్టాల్సిందే. మరి ఈ డెడ్ లైన్ లో సినిమాలు ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటాయో చూడాలి.