అల్లు అర్జున్ తెలుగు సినిమా అగ్ర నటుడు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడు. హాస్యనటుడు పద్మశ్రీ అల్లు రామలింగయ్య మనవడు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ లకు మేనల్లుడు. అల్లు అర్జున్ 1985 లో వచ్చిన విజేత సినిమా ద్వారా బాల నటుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తరువాత 1986లో స్వాతిముత్యం సినిమాలో కూడా బాలా నటుడిగా నటించాడు.
ఆ తర్వాత వచ్చిన డాడీ సినిమాలో అతిథి పాత్రలో కనిపిస్తాడు. 2003లో వచ్చిన గంగోత్రి సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇతని సరసన అతిథి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. మొదటి సినిమానే విజయం సాధించడం ఇంకా 2004లో ఈ చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా నంది అవార్డు సొంతం చేసుకున్నారు. తర్వాత బన్నీ, దేశముదురు, హ్యాపీ, రేసుగుర్రం, ఆర్య2, పరుగు లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు పొందాడు.
ఇతనిని బన్నీ, ఆర్య అనే పేర్లతో పిలుస్తారు. ఇటీవలే విడుదలైన పుష్ప సినిమా భారీ విజయం సొంతం చేసుకుంది. తెలుగులోనే కాక దక్షిణాదిలో కూడా ఇతనికి కోట్లల్లో అభిమానులు ఉన్నారు. కేరళలో అయితే బన్నీని మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు. అల్లు అర్జున్ హైదరాబాద్ కు చెందిన స్నేహ రెడ్డి ని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు అల్లు అయాన్, అల్లు అర్హ.
ఈయన 75వ స్వాతంత్ర దినోత్సవాన్ని న్యూయార్క్ లో తన భార్యా పిల్లలతో కలిసి జరుపుకున్నారు. ఆయన అక్కడి వీధుల్లో ర్యాలీ నిర్వహించి ఏ భారత్ కా తరంగ్ హై హమారా తరం నీచే కబి నహి రహేంగా అంటూ నినాదాలు చేస్తూ సందడి చేశారు. అయితే ర్యాలీలో తన పక్కన నిల్చున్న అమ్మాయితో అల్లు అర్జున్ మాట్లాడుతుండగా కాస్త కోపంగా అల్లు అర్జున్ చెవిలో ఏదో చెప్పింది భార్య స్నేహ రెడ్డి. దీనితో అల్లు అర్జున్ సైలెంట్ అయిపోయాడు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.