అల్లు స్టూడియో ప్రారంభించేది ఆ రోజే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లూరి రామలింగయ్య సేవల గురించి అందరికీ తెలిసిందే. ఎన్నో సినిమాలలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ బ్యానర్స్ స్థాపించి గత 50 సంవత్సరాల నుంచి ఈ బ్యానర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేశారు.ఇలా అల్లు అరవింద్ నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకోగా ఈయన కుమారుడు అల్లు అర్జున్ ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో హీరోగా ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఇలా సినిమా రంగంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు కుటుంబం సినిమా రంగంలో మరో మెట్టు ముందుకు వెళ్లారని తెలుస్తోంది. హైదరాబాద్ లోఇప్పటికే ఎన్నో స్టూడియోలు ఉండగా తాజాగా అల్లు అరవింద్ సైతం అల్లు స్టూడియోస్ నిర్మాణ పనులను చేపట్టారు. 100 కోట్ల బడ్జెట్ తో అల్లు స్టూడియోస్ నిర్మాణ పనులు మొదలైన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ స్టూడియో నిర్మాణ పనులు పూర్తయ్యాయని త్వరలోనే ఈ స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

అక్టోబర్ 1వ తేదీ అల్లు రామలింగయ్య జయంతి కావడంతో అదే రోజున అల్లు స్టూడియోస్ ప్రారంభించాలని అల్లు అరవింద్ భావించారట. ఈ క్రమంలోనే ఈ స్టూడియో ప్రారంభోత్సవ కార్యక్రమంలో అల్లు అరవింద్ కుటుంబ సభ్యులతో పాటు మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సభ్యులకు కూడా హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ స్టూడియో ప్రారంభమైన తర్వాత ఆహా ఓటీటికి సంబంధించిన షూటింగ్ పనులు ఇతర కార్యకలాపాలు అల్లు స్టూడియోస్ లోనే జరగనున్నట్లు తెలుస్తోంది.ఈ స్టూడియో నిర్మాణంలో అల్లు అరవింద్ ముగ్గురు కొడుకులు భాగస్వాములుగా ఉన్నట్టు సమాచారం.