లాభాల కోసం అల్లు స్టూడియో కట్టలేదు.. అది ఒక జ్ఞాపకం మాత్రమే: అల్లు అరవింద్

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు నటుడు అల్లు రామలింగయ్య. నాడు అల్లు రామలింగయ్య వేసిన బాటలోనే ఆయన వారసులుగా అల్లు అరవింద్ అలాగే ఆయన మనవళ్ళుగా అల్లు అర్జున్ అల్లు శిరీష్ అల్లు బాబి వంటి వారు అదే బాటలో ప్రయాణం చేస్తూ అల్లు అనే బ్రాండ్ కు ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టారు.ఇప్పటికే గీత ఆర్ట్స్ బ్యానర్ ద్వారా అల్లు అరవింద్ ఎంతో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేయగా అల్లు అర్జున్ ఏకంగా పాన్ ఇండియా స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు కుటుంబం ఇండస్ట్రీలో మరో మైలు రాయి చేరుకుంది. అల్లు పేరుతో నేడు ఒక స్టూడియోని ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే.అల్లు రామలింగయ్య శత జయంతి వేడుక సందర్భంగా ఘనంగా హైదరాబాద్లోని గండిపేట ప్రాంతంలో నిర్మించిన ఈ అల్లు స్టూడియోను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభం చేశారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ అల్లు స్టూడియోను లాభం వస్తుంది అనే దృక్పథంతో నిర్మించలేదని, అది ఒక ఆస్తి, ఒక అవసరం. ఇప్పటివరకు నేను ఎన్నో సంపాదించిన ఇంకా ఏదో సంపాదించాలని ఆశ నాకు లేదు. గీత ఆర్ట్స్ఆహా వీటన్నింటిని నిర్మించాను అయితే ఇవన్నీ నా కుమారులకు ఇస్తున్నాను అలాగే ఈ అల్లు స్టూడియో అనేది కూడా లాభం కోసం మాత్రం కాదు ఇది ఒక జ్ఞాపకం అని ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడారు.ఇక ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ మాట్లాడుతూ… తన తాత గారి కోరిక మేరకే ఈ స్టూడియో నిర్మించామని,ఈ కార్యక్రమానికి విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు అలాగే తన ఆర్మీకి అల్లు అర్జున్ కృతజ్ఞతలు తెలిపారు.