ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనున్న అల్లు స్నేహారెడ్డి.. హీరోయిన్లకు గట్టి పోటీనే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే.పుష్ప సినిమా ముందు వరకు కేవలం సౌత్ ఇండస్ట్రీలో మాత్రమే ఈయన పేరు ప్రఖ్యాతలు పొందారు. అయితే పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఇకపోతే అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ గురించి కూడా అందరికీ ఎంతో సుపరిచితమే.

ఈమె నటి కాకపోయినప్పటికీ హీరోయిన్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకొని ఎంతోమందికి అభిమానిగా మారిపోయారు.హీరోయిన్లతో పాటు ఈమె పెద్ద ఎత్తున ఫోటోషూట్ లో జరపడం ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను సొంతం చేసుకున్నారు.హీరోయిన్ కట్ అవుట్ కు ఏమాత్రం తీసిపోనటువంటి ఈమె త్వరలోనే చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టబోతుందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.తాజాగా అల్లు స్నేహారెడ్డి గురించి వస్తున్న వార్తల ప్రకారం ఈమెకి సినిమాలపై ఆసక్తి ఉందని తన కోరికను తన భర్త అల్లు అర్జున్ ముందు పెట్టడంతో ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

అల్లు అర్జున్ ఇష్టప్రకారమే ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారట. అయితే ఈమె తెలుగు ఇండస్ట్రీలో కాకుండా మలయాళ ఇండస్ట్రీలోకి మొదటగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. అల్లు అర్జున్ కు తెలుగులో ఎలాంటి క్రేజ్ ఉందో మలయాళ ఇండస్ట్రీలో కూడా అంతే క్రేజ్ ఉంది.ఈ క్రమంలోనే మలయాళ ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో సినిమాలో ఈమె కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం.అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అల్లు అర్జున్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.