అల్లు అయాన్ మామూలోడు కాదు.. ఇప్పుడే నేర్చేసుకుంటున్నాడు.. వీడియో వైరల్

అల్లు పిల్లలు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అల్లు అయాన్, అల్లు అర్హలు చేసే క్యూట్ అల్లరికి సోషల్ మీడియా ఫిదా అవుతూ ఉంటుంది. ఈ ఇద్దరి గురించి అల్లు స్నేహా రెడ్డి ఎప్పటికప్పుడూ ఏదో ఒక అప్డేట్ఇస్తూనే ఉంటుంది. పిల్లలు చేసే అల్లరి, ఇద్దరూ కలిసి ఆడుకునే ఆటలు, క్యూట్ మెమోరీస్‌ను పోస్ట్ చేస్తూ అల్లు అభిమానులకు ఖుషీ చేస్తూ ఉంటుంది. ఈ విషయంలో మాత్రం అల్లు అర్జున్ కంటే అల్లు స్నేహానే బెటర్ అంటారు అభిమానులు.

Allu sneha Shares Allu Ayaan skating Video
Allu sneha Shares Allu Ayaan skating Video

అయాన్, అర్హల గురించి అప్డేట్‌లు తెలియాలన్నా రోజూ వారు ఏం చేస్తున్నారు.. ఎంత అల్లరి చేస్తున్నారు.. అనే విషయాలు తెలియాలన్నా అల్లు స్నేహాను ఫాలో అవ్వాల్సింది. రీసెంట్‌గా అర్హ ఇళ్లంతా ఎలా పాడు చేసిందో చెప్పింది. చేతికి రంగులు పూసుకుని ఇంటి నేలంతా పాడు చేసింది. ఇక అల్లు అయాన్, అర్హల మధ్య ఉన్న అన్యోన్యతను చూపించే మరొక ఫోటోను షేర్ చేసింది. అయాన్‌ను తలదిండుగా మార్చుకున్న అర్హ ఫోటోను షేర్ చేసింది.

ఇక ప్రత్యేకంగా అయాన్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. అయాన్ డ్యాన్స్ చేసే వీడియోలు, అర్హను ఏడిపించే వీడియోలు, చిట్టి చెల్లిని బైక్ ఎక్కించుకుని తిరిగే వీడియోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా అయాన్ ఇంట్లోనే స్కేటింగ్ చేస్తోన్న వీడియోను షేర్ చేసింది. స్కేటింగ్‌లోని మెళుకువలను కూడా ఇప్పుడే నేర్చేసుకున్నట్టున్నాడు. అయాన్ గిర గిర తిరుగుతున్న వీడియోను అల్లు స్నేహా షేర్ చేయగా అది తెగ వైరల్ అవుతోంది.