చలికాలం మొదలైందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాత్రి పూట, ఉదయాన్నే చలి వణికిస్తోంది. పెద్దవాళ్లు, చిన్నవాళ్లు ఈ చలిని తట్టుకోలేకపోతోన్నారు. ప్రారంభంలోనే ఇలా ఉంటే ఇకరాను రాను ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఈ చలిలో అల్లు అయాన్ ఎక్కడికో బయల్దేరారు. ఆ వీడియోను అల్లు స్నేహా షేర్ చేసింది. మామూలుగా అల్లు పిల్లల అల్లరిని అల్లు స్నేహారెడ్డి ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంది.
అల్లు పిల్లలు అర్హ, అయాన్ చేసే అల్లరికి సోషల్ మీడియాలో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అయాన్, అర్హల అన్యోన్యతను తెలియజేసేలా షేర్ చేసే పోస్ట్‌లు మరింతగా వైరల్ అవుతుంటాయి. అల్లు అర్జున్ తన పిల్లలతో చేసే అల్లరి వేరే లెవెల్‌లో ఉంటుంది. అర్హతో పెట్టే పెళ్లి చర్చలు, అయాన్‌తో కలిసి ఆడుకునే ఆటలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంటారు. ఈ లాక్డౌన్ సమయంలో అయాన్, అర్హలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.
తాజాగా అయాన్ చీకటి పడ్డాక తన ఇంటి గార్డెన్ ఏరియాలో వాకింగ్‌కు వెళ్లినట్టు కనిపిస్తోంది. వొళ్లంతా కప్పుకుని గాలి కూడా లోపలికి దూరనంత స్వెట్టర్‌ను వేసుకుని బయటకు బయల్దేరాడు. అయాన్ వెంట స్నేహా కూడా గార్డెన్‌లో చక్కర్లు కొట్టినట్టుంది. మరి అయాన్ అంత చలిలో ఎందుకు అలా చక్కర్లు కొట్టాడో. అల్లు అర్జున్ ప్రస్తుతం ఫ్యామిలీకి దూరంగా ఉన్నాడు. నేడు పుష్ప షూటింగ్ ప్రారంభం కానుంది. దాని కోసం ఈ మధ్యే అల్లు అర్జున్ రాజమండ్రిలో ల్యాండ్ అయ్యాడు.