బుల్లి బుట్టబొమ్మ ఎంత క్యూట్‌గా ఉందో.. అల్లు అర్హ వీడియో వైరల్

టాలీవుడ్ సెలెబ్రిటీ కిడ్స్‌లో అల్లు అర్హ, అల్లు అయాన్‌లు సోషల్ మీడియాను ఊపేస్తుంటారు. ఆ ఇద్దరికి సోషల్ మీడియాలో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. అల్లు అర్జున్ తన పిల్లలతో కలిసి చేసే అల్లరి తెగ వైరల్ అవుతుంటుంది. మరీ ముఖ్యంగా అర్హతో కలిసి చేసే వాగ్వాదం, మాటల చిలిపి యుద్దం అభిమానులను ఆకట్టుకుంటుంది. పెళ్లి గురించి ఇద్దరూ మాట్లాడుకునే మాటలు, రాములో రాముల స్టెప్పులను దోశ స్టెప్పులుగా అభివర్ణించడం ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

Allu sneha Reddy shares Allu Arha Diwali Special Video,Allu Arha
Allu sneha Reddy shares Allu Arha Diwali Special Video,Allu Arha

ఇక అల్లు స్నేహారెడ్డి పిల్లలుచేసే అల్లరిని ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. ఈ లాక్డౌన్‌లో అల్లు పిల్లలు చేసిన అల్లరిని అందరూ చూశాం. బుల్లి బైకు మీద చెల్లిని ఎక్కించుకుని ఇళ్లంతా చక్కర్లు కొట్టాడు అయాన్. బన్నీతో అర్హ ఆడే దాగుడు మూతలు, అర్హ ఇళ్లంతా రంగులు వేసి రచ్చ రచ్చ చేయడం గురించి తన ఫాలోవర్స్‌కు తెలిసేలా అల్లు స్నేహా రెడ్డి షేర్ చేస్తూనే ఉంటుంది.

 

తాజాగా దీపావళి సందర్భంగా తమ బుట్టబొమ్మ బుగ్గల అర్హ ఎంత అందంగా రెడీ అయిందో అల్లు స్నేహారెడ్డి వీడియో షేర్ చేసింది. అందులో అర్హ, బాబీ కూతురు కూడా ఉంది. ఇద్దరూ అదిరిపోయే డ్రెస్సులను ధరించారు. ఇక బన్నీ దగ్గరుండి మరీ అర్హ చేత క్రాకర్స్ వెలిగేలా అంటిస్తున్నాడు. మొత్తానికి అల్లు ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.