ఇంట్లోనే గిరగిర తిరిగేస్తోంది.. అల్లు అర్హ అల్లరి మామూలుగా లేదు!!

Allu Sneha Reddy shares Allu Arha Cute Video

అల్లు పిల్లలు సోషల్ మీడియాలో చేసే అల్లరి గురించి అందరికీ తెలిసిందే. అర్హ, అయాన్‌లు చేసే రచ్చను అల్లు స్నేహారెడ్డి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. ఈ మధ్య నిహారిక పెళ్లిలో రచ్చ రచ్చ చేసిన ఈ పిల్లలు ఇంట్లో తాపీగా ఆడుకుంటున్నారు. మెగా ఈవెంట్‌లో అల్లు వారి బ్రాండ్ తప్పనిసరిగా కనిపించాల్సిందే. అలా ఈ సారి నిహారిక పెళ్లిలో అల్లు ఫ్యామిలీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. అందులోనూ మరీ ముఖ్యంగా అర్హ, అయాన్‌లు తెగ సందడి చేశారు.

వారం రోజులుగా నిహారిక పెళ్లి సందడి కనిపిస్తే.. అందులో దాదాపు ప్రతీదాంట్లో అల్లు పిల్లలు రచ్చ కనిపించింది. హైద్రాబాద్‌లో ఫ్లైట్ ఎక్కిన క్షణం నుంచి అల్లు పిల్లలు స్పెషల్ అట్రాక్ట్‌గా నిలిచారు. సంగీత్, పెళ్లిలో అల్లు పిల్లలు దుమ్ములేపారు. ఉదయ్ విలాస్ ప్యాలెస్‌లో చిట్టి రాకుమార్తెలా అర్హ సందడి చేసిన తీరు, ఆ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తాజాగా అర్హ ఇంట్లో కూల్‌గా చక్కర్లు కొట్టేస్తోంది.

Allu Sneha Reddy shares Allu Arha Cute Video
Allu Sneha Reddy shares Allu Arha Cute Video

లాక్డౌన్ నుంచి అర్హ, అయాన్‌లు ఇంట్లో ఎంత అల్లరి చేస్తున్నారో స్నేహారెడ్డి చెబుతూనే వస్తోంది. అర్హ, అయాన్‌లు బుల్లి బైక్ ఎక్కి చక్కర్లు కొట్టిన వీడియోను షేర్ చేస్తే అది ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందు. చెల్లి అర్హను ఎక్కించుకుని అన్న అయాన్ బాగానే షికార్లు కొట్టాడు. అయితే తాజగా అర్హ మాత్రమే బుల్లి బైక్ ఎక్కి షికార్లు కొట్టేస్తోంది. ఇంట్లో గిరగిరా తిరిగేస్తూ అల్లరి చేస్తోంది. ప్రస్తుతం అల్లు స్నేహారెడ్డి షేర్ చేసిన ఈ వీడియో బాగానే వైరల్ అవుతోంది. ఇక అల్లు అర్జున్ పుష్ప సినిమా షూటింగ్ కోసం మారెడుమిల్లిలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.