అల్లు పిల్లల అల్లరి గురించి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో అల్లు పిల్లలకు ఉండే ఫాలోయింగే వేరు. అల్లు అర్హ, అల్లు అయాన్‌లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. పిల్లల అప్డేట్స్, అల్లరి గురించి తెలుసుకునేందుకే అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డిని ఫాలో అవుతుంటారు. రోజూ ఏదో ఒక పోస్ట్ చేస్తూ అల్లు పిల్లల అల్లరి గురించి చెబుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా క్యూట్ బుగ్గల అర్హ చేసే సందడి నెటిజన్లను కట్టిపడేస్తుంది.
చిట్టి చేతులు ముద్దుముద్దుగా రాసే అక్షరాలు ఎంతో అందంగా అనిపిస్తుంటాయి. తల్లిదండ్రులకు మరీ ముఖ్యంగా తమ పిల్లలు అలా రాస్తుంటే ఎంతో ముచ్చటపడుతుంటారు. అలాంటి చిట్టి చేతులతో అల్లు అర్హ రాసిన వాటిని చూసి స్నేహారెడ్డి ముచ్చటపడినట్టు కనిపిస్తోంది. ఐ లవ్ మై మామ్ అంటూ అల్లు అర్హ చిట్టి చేతులతో రాసింది. అలా రాసిన లెటర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అంతే కాకుండా అల్లు అర్హ క్యూట్ ఫోటోను స్నేహారెడ్డి షేర్ చేసింది. ఇందులో జుట్టు అంతా చిందరవందర ఉండగా.. అందాల రాక్షసి అనిపించేలా ఉంది. అయితే ఇందులో అర్హ ఎటువైపు తిరిగి ఉందో అనే అనుమానాన్ని కలిగించేలా ఉంది. మొత్తానికి అల్లు అర్హలో ఆ జుట్టు ఎంతో అట్రాక్ట్‌గా ఉంటుందని మరో సారి నిరూపించింది. అల్లు పిల్లలు అంటూ ఆ మాత్రం ఉండాల్సిందే అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.