అల్లు అర్జున్ భార్యగా అల్లు స్నేహారెడ్డికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ ఇద్దరూ ఎక్కడైనా జంటగా కనిపిస్తే చాలు కెమెరా కళ్లన్నీ వారిపైనే పడతాయి. ఆ మధ్య నిహారిక నిశ్చితార్థం ఈవెంట్‌లో బన్నీ స్నేహల ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. వీళ్లే కొత్తజంటలా కనిపించారని నెటిజన్లు కామెంట్లు చేశారు. అయితే అల్లు స్నేహ ఈ మధ్య ఫోటో షూట్లలోనూ ఆసక్తి చూపిస్తోంది. మామూలుగానే అల్లు స్నేహా ఇటు మోడ్రన్ డ్రెస్సులు, అటు సంప్రదాయ దుస్తులను ధరిస్తుంది.
పార్టీ మూడ్‌లో ఉంటే.. మోడ్రన్ డ్రెస్సులు ధరిస్తుంది. ఆ మధ్య ఓ సారి పబ్‌కు వెళ్లినప్పుడు, ఈ మధ్య జరిగిన బర్త్ డే ఈవెంట్‌లోనూ అల్లు స్నేహా తన డ్రెస్సింగ్‌తో అందర్నీ షాక్‌కు గురి చేసింది. బన్నీ సతీమణి కూడా అందాల ఆరబోతకు సై అంటోందా? అని అనుమానాలు వ్యక్తం చేశారు నెటిజన్లు. మామూలుగా బన్నీ.. అర్హ, అయాన్‌లకు సంబంధించిన అప్డేట్లు ఇస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. అల్లు స్నేహా తన ఫ్రెండ్స్‌తో కలిసి అప్పుడప్పుడు పార్టీలు కూడా చేసుకుంటుంది.
తాజాగా అల్లు స్నేహ కొన్ని ఫోటోలను షేర్ చేసింది. బాలీవుడ్ ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్ర స్పెషల్‌గా డిజైన్ చేసిన దుస్తులను ధరించి పోజులిచ్చింది. అల్లు స్నేహా ఈ ఫోటోల్లో కనిపించి అందరి మతులు పోగొడుతోంది. స్టార్ హీరోయిన్‌లా ఉంది, అగ్గి రాజేస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అల్లు స్నేహా ఇటివలే పుష్ప సెట్‌లో సందడి చేసింది. అర్హ బర్త్ డే సందర్బంగా అందరూ పుష్ప సెట్‌లో పార్టి చేసుకున్నారు. ఆ ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.