అల్లు వారింట్లోకి చొరబడిన పాము.. స్నేహా రెడ్డి పోస్ట్ వైరల్

Allu Sneha Reddy about Snake Visting Home

దినపత్రికల్లో, వెబ్ సైట్స్‌లో మామూలుగా ఓ హెడ్డింగ్ కనిపిస్తూ ఉంటుంది. ఆఫీస్‌లోకి ఊహించని అతిథి, ఇంట్లోకి వచ్చిన అతిథి అంటూ కొన్ని హెడ్డింగ్స్ కనిపిస్తుంటాయి. అయితే ఆ అతిథి ఎవరన్నది కొంత మందికి అర్థమవుతుంది. ఇంకొందరికి మాత్రం అంతగా అంతు పట్టదు. అయితే ఆ అతిథి పాము. పామును వచ్చిందని చెప్పడానికి సూచికంగా అందరూ అతిథి అని సంబోధిస్తుంటుంటారు. అలానే అల్లు స్నేహారెడ్డి కూడా ఓ పోస్ట్ చేసింది.

Allu Sneha Reddy about Snake Visting Home
Allu Sneha Reddy about Snake Visting Home

మామూలుగా అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. అల్లు అర్జున్, అర్హ, అయాన్‌లు చేసే అల్లరిని ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో షేర్ చేస్తూనే ఉంటుంది. ఇక పిల్లల సందడిని మాత్రం క్రమం తప్పకుండా చెబుతూ ఉంటుంది. అన్నాచెల్లిళ్ల అనుబంధం, అయాన్ అర్హలు ఆడుకునే వీడియోలు, చెల్లిని ఆడించే అయాన్ వీడియోలు షేర్ చేస్తూనే ఉంటుంది.

అలాంటి స్నేహారెడ్డి తాజాగా వారింట్లోకి వచ్చిన పామును ఫోటో తీసింది. విజిట్స్ అంటూ చెబుతూ.. సందర్శించడానికి వచ్చినట్టుగా చెప్పుకొచ్చింది అల్లు స్నేహారెడ్డి. మొత్తానికి అల్లు వారింట్లో ఈ పాము మాత్రం గట్టిగానే రచ్చ చేసినట్టు కనిపిస్తోంది. అసలే బన్నీ ఇంటి చుట్టూ కూడా చాలా గ్రీనరి ఉంటుంది. అలా ఉండటంతో ఇలా పాము ఇంట్లోకి వచ్చినట్టుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆగస్ట్ 13న పుష్ప విడుదల కాబోతోందని తాజాగా ప్రకటించారు.