చిరంజీవిని చూడగానే జాతకం చెప్పిన అల్లు రామలింగయ్య… అందుకే అల్లుడయ్యాడు?

సినిమా ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి నేడు తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి వెళ్లిన నటుడు చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇకపోతే ఈయన అప్పుడప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న సమయంలో అల్లూ రామలింగయ్య కమెడియన్ గా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇలా ఫేమస్ నటుడు అయినటువంటి అల్లూ రామలింగయ్య అప్పుడప్పుడు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న మెగాస్టార్ చిరంజీవిని ఏరుకోరి అల్లుడిని చేసుకోవడం వెనుక ఓ కారణం ఉంది.

చిరంజీవి నటించిన మన ఊరి పాండవులు సినిమాలో చిరంజీవి సైకిల్ తొక్కే సన్నివేశం ఉంది ఈ సినిమాలో అల్లూ రామలింగయ్య కూడా ఓ పాత్రలో నటించారు. అల్లూ రామలింగయ్య చిరంజీవిని చూడటం అదే మొదటిసారి. అలా చిరంజీవిని చూసిన వెంటనే అల్లు రామలింగయ్య నిర్మాత జయ కృష్ణతో మాట్లాడుతూ ఆ సైకిల్ కుర్రాడు ఎవరో కానీ అతనికి మంచి ఫ్యూచర్ ఉంది తన కళ్ళలోనే నటుడు కావాలనే కసి కనపడుతుంది అంటూ తన జాతకం పసికట్టారట.

ఇక అల్లు రామలింగయ్య తన కుమారుడు అల్లు అరవింద్ కు చిరంజీవి గురించి ఎంక్వయిరీ చేయమని చెప్పగా చిరంజీవి నటించిన పున్నమినాగు సినిమా ప్రీవ్యూ సందర్భంగా అల్లు అరవింద్ చిరంజీవి గారిని కలిశారట.ఆ సమయంలో చిరంజీవి అల్లు అరవింద్ తో ఎంతో వినయంగా మాట్లాడటంతో అల్లు అరవింద్ నాన్నగారు మిమ్మల్ని ఒకసారి కలవాలంటున్నారు. వస్తారా అని అడగడంతో చిరంజీవి అలా మొదటిసారి అల్లు రామలింగయ్య ఇంటిలో అడుగుపెట్టి అదే ఇంటికి అల్లుడు అయ్యారు.ఈయనలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించిన అల్లు రామలింగయ్య తాను ఎప్పటికైనా గొప్ప నటుడు అవుతాడని అందుకే తన కుమార్తె సురేఖని ఇచ్చి వివాహం చేయాలని భావిస్తున్నట్లు చెప్పడంతో చిరంజీవి ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక సురేఖ కూడా చిరంజీవిని ఇష్టపడటంతో వీరిద్దరు పెళ్లి జరిగింది.