జూనియర్ స్టైలీష్ స్టార్ రెడీ అవుతున్నాడు.. క్యూట్ స్టెప్పులతో అల్లు అయాన్ రచ్చ

టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ గురించి, అతని పిల్లల టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బన్నీ తన పిల్లలతో ఎంత సరదాగా ఉంటూ అల్లరి చేస్తాడో అందరికీ తెలిసిందే. అల్లు అయాన్, అల్లు అర్హలు చేసే రచ్చలో బన్నీ కూడా భాగస్వామి అవుతాడు. అర్హతో బన్నీ మాటల యుద్దం, ముద్దు ముద్దు వాగ్వాదం ఎంత వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. పెళ్లి విషయంలో తండ్రీ కూతుళ్ల ముచ్చట్లు ఎంతగా హల్చల్ మనమంతా చూశాం.

Allu Ayaan Cute Steps Goes Viral
Allu Ayaan Cute Steps Goes Viral

WhatsApp Unknown 2020-10-13 at 20.54.21 WhatsApp Unknown 2020-10-13 at 20.54.21

లాక్ డౌన్‌లో అల్లు అయాన్, అల్లు అర్హలు బాబాయ్ శిరీష్ ఆధ్వర్యంలో డ్యాన్సులు కూడా చేశారు. అల్లు శిరీష్ చేసే స్టెప్పులను చూస్తూ.. అయాన్, అర్హలు కూడా వేశారు. ఆ క్యూట్ వీడియో ఎంతగానో వైరల్ అయింది. మామూలుగానే అల్లు పిల్లల అల్లరి సోషల్ మీడియాలో నెటిజన్లను ఆకట్టుకుంటుంది. రీసెంట్‌గా అల్లు స్నేహారెడ్డి పిల్లలు చేసే అల్లరి, వారి అన్యోన్య బంధాన్ని సోషలీ మీడియాలో షేర్ చేసింది.

Allu Ayaan Cute Steps Goes Viral
Allu Ayaan Cute Steps Goes Viral

ఇక తాజాగా అయాన్ టీవీలో వచ్చే పాటకు కాలు కదిపాడు. క్యూట్ క్యూట్ స్టెప్పులేస్తూ రచ్చ రచ్చ చేస్తున్నాడు. చూస్తుంటే ఇప్పుడే ట్రైనింగ్ తీసుకుని డ్యాన్సులో అల్లు అర్జున్ అంతటి వాడేయ్యాలా ఉన్నాడు. జూనియర్ స్టైలీష్ స్టార్ అనే ట్యాగ్‌కు సరైనోడిలా మారిపోతాడేమో. ప్రస్తుతం అయాన్ వేసిన స్టెప్పులు బాగానే వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ఫ చిత్రంతో బిజీగా ఉన్నాడు. మైత్రీ మూవీస్ నిర్మాణంలో సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు.