ఎంత ముద్దుగా ఉన్నారో.. అల్లు పిల్లల అన్యోన్యత చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

టాలీవుడ్ క్యూట్ కిడ్స్‌లో ముందు వరుసలో ఉంటారు అల్లు వారి చిచ్చర పిడుగులు. అల్లు అర్జున్ కూడా వారితో కలిస్తే చిన్న పిల్లవాడు అయిపోతాడు. అల్లు అయాన్, అల్లు అర్హలతో బన్నీ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. వీరు చేసే అల్లరి చేష్టలతో ఇళ్లంతా సందడి సందడిగా మారుతుంది. మరీ ముఖ్యంగా బుగ్గల అర్హతో బన్నీ చేసే అల్లరికి సోషల్ మీడియా ఫిదా అవ్వాల్సిందే. పెళ్లి టాపిక్‌పై ఈ తండ్రీ కూతుళ్ల మధ్య జరిగే వాదన అందరికీ తెలిసిందే.

Allu Ayaan And Allu Arha Cute Pic Goes Viral
Allu Ayaan And Allu Arha Cute Pic Goes Viral

బన్నీ-అర్హ మధ్య జరిగే సంభాషణ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. పెళ్లి టాపిక్, దోశ స్టెప్ ఇలా ఎన్నో వీడియోలను బన్నీ షేర్ చేశాడు. ఇక అయాన్, అర్హల అల్లరి గురించి అల్లు స్నేహారెడ్డి నిత్యం ఏదో ఒకటి అప్డేట్ ఇస్తూనే ఉంటుంది. లాక్ డౌన్‌లో వీరిద్దరు ఇళ్లు పీకి పందిరి వేసినంత అల్లరి చేశారు. బుల్లి బైక్ మీద చెల్లిని ఎక్కించుకుని ఇళ్లంతా చక్కర్లు కొట్టేశాడు అయాన్. ఇక తండ్రితో దాగుడు మూతలు ఆడుతున్న అర్హ వీడియోను స్నేహారెడ్డి షేర్ చేసింది.

Allu Ayaan And Allu Arha Cute Pic Goes Viral
Allu Ayaan And Allu Arha Cute Pic Goes Viral

రీసెంట్‌గా ఇంటి ఫ్లోర్‌ను ఎలా నాశనం చేసిందో కూడా చెప్పింది. చేతికి రంగులు పూసుకుని ఇంటి ఫ్లోర్‌పై డ్రాయింగ్ వేయడం, చేతులను, నేలను నాశనం చేయడం గురించి స్నేహారెడ్డి ఫోటోల రూపంలో తెలిపింది. తాజాగా అల్లు పిల్లల అనుబంధం గురించి ఓ ఫోటో షేర్ చేసింది. అల్లు అయాన్ హాయిగా పడుకుంటే.. ఆ బుడ్డోడిని దిండుగా చేసుకుని అర్హ చక్కగా పడుకుంది. చెల్లి కోసం అయాన్ దిండుగా మారిపోయాడు.