పాపకి అల్లు అర్జున్ ఆశీస్సులు లభించినట్టే.!

అల్లు అర్జున్‌ని మల్లూ అర్జున్.. అని కూడా అంటుంటారు. మలయాళ సినీ పరిశ్రమలో అల్లు అర్జున్‌కి ఆ స్థాయి క్రేజ్ వుంది. తెలుగుతోపాటు, కేరళలోనూ బలమైన మార్కెట్ సంపాదించుకున్నాడు అల్లు అర్జున్.. అదీ చాలాకాలం క్రిందటే.

ఇక, ‘సామజవరగమన’ సినిమాని చూసిన అల్లు అర్జున్, ఆ చిత్ర బృందాన్ని అభినందించాడు. అందులో ప్రత్యేకంగా ‘మై మలయాళీ’ అంటూ, హీరోయిన్ రెబా మోనికా జాన్‌ని అభినందించాడు అల్లు అర్జున్.

దాంతో, ‘మీతో సినిమా చేసే అవకాశం త్వరలో వస్తుందని ఆశిస్తున్నా..’ అంటూ రిప్లయ్ ఇచ్చింది అల్లు అర్జున్‌కి.. ఆయన తన మీద కురిపించిన ప్రత్యేకమైన ప్రశంసలకు ఉబ్బి తబ్బిబ్బవుతూ.

‘మై మలయాళీ’ అని ఊరికే అనెయ్యలేదుట అల్లు అర్జున్. తన తదుపరి సినిమాలో ఛాన్స్ ఇచ్చే ఉద్దేశ్యంతోనే అలా అన్నాడంటూ ఓ గాసిప్ బయటకు వచ్చింది. ప్రస్తుతానికైతే ‘పుష్ప’ సినిమా చేస్తున్నాడు బన్నీ.