ఆహా విషయంలో అల్లు అరవింద్ కంటే అల్లు అర్జున్ ప్లాన్ చూసి మైండ్ బ్లాకవుతోందట ..?

అల్లు ఫ్యామిలీ సినీ ఇండస్ట్రీలో ప్రతీ విషయంలోను ముందుంటారన్న సంగతి తెలిసిందే. ఆ నిర్మాణ సంస్థలో ఎంతో మంది కొత్త వాళ్ళు దర్శకులుగా మారారు. నటులయ్యారు. అయితే కరోనా తో థియోటర్స్ మూత పడటంతో డిజిటల్ ప్లాట్ ఫాంస్ ఊపందుకున్నాయి. అందుకే అల్లు అరవింద్ ఆహా అన్న యాప్ ని మొదలు పెట్టి అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటల్ కంటెంట్ ని అందుబాటులోకి తీసుకు వస్తున్నారు. ఈ క్రమంలో ఆహా కోసం చిన్న సినిమాలు, వెబ్ సిరీస్, రియాలిటి షోస్ వంటి ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ ని ప్లాన్ చేస్తున్నారు.

Will Allu Aravind's 2nd Hand Strategy Work Out?

అంతేకాదు కొత్త తరహా కార్యక్రమాలతో డిజిటల్ కంటెంట్ కోసం కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. స్టార్ దర్శకుల దగ్గర్నుంచి యువ దర్శకులను ఆహా కోసం తీసుకు వస్తున్నారు. టాలెంట్ ఉన్న కొత్తవాళ్ళకి అవకాశాలు ఇస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. సంకల్ప్ రెడ్డి, నందిని రెడ్డి లాంటి సీనియర్ దర్శకులతో వెబ్ సిరీస్ ని తీస్తున్నారు. ఇక రీసెంట్ గా ప్రపంచస్థాయి సౌకర్యాలతో అల్లు స్టూడియోస్ నిర్మిస్తున్నారు.

AHA Video Brings Telugu Superstar Allu Arjun for its Mega Event

ఇప్పుడు తండ్రి అల్లు అరవింద్ బాటలోనే అల్లు అర్జున్ కూడా సాగుతున్నాడు. ఓటీటీలో వెబ్ సిరీస్ ఫార్మాట్ బాగా సక్సస్ అవడంతో…ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు సినిమాల కంటే వెబ్ సిరీస్ కంటెంట్ మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే అందరూ ఈ వెబ్ సిరీస్ మీద దృష్టి పెట్టారు. అందుకే అల్లు అర్జున్ కూడా సొంతగా బ్యానర్ ఏర్పాటు చేసి వెబ్ సిరీస్ లు నిర్మించాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే అందరిలా రెగ్యులర్ కంటెంట్ తో కాకుండా బయోపిక్స్ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నట్టు తెలుస్తుంది. అందుకు కారణం ప్రేక్షకుల్లో రెగ్యులర్ వెబ్ సిరీస్ కంటే బయోపిక్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండటమే. ఈ విషయంలో అల్లు అరవింద్ కంటే ఆయన కొడుకు అల్లు అర్జున్ ప్లాన్ మైండ్ బ్లోయింగ్ అంటున్నారు.