స్నేహా రెడ్డి అల్లువారి కోడలిగా అడుగుపెట్టటానికి కండిషన్స్ పెట్టిన అల్లు అర్జున్ తల్లి..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతలు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దివంగత ప్రఖ్యాత నటుడు అల్లు రామలింగయ్య వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అల్లు అరవింద్ నటుడిగా రాణించ లేకపోయినా కూడా నిర్మాతగా మారి సక్సెస్ అయ్యాడు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రొడ్యూసర్లలో అల్లు అరవింద్ మొదటి వరుసలో ఉన్నారు. ఇక అల్లు అరవింద్ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా గుర్తింపు పొందాడు. ఇక గతేడాది విడుదలైన పుష్ప సినిమా ద్వారా తన నట విశ్వరూపాన్ని చూపించి పాన్ ఇండియా హీరోగా బాగా పాపులర్ అయ్యాడు.

ఇదిలా ఉండగా అల్లు అర్జున్ ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధంలేని స్నేహారెడ్డిని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. 2011లో అల్లు అర్జున్ స్నేహ రెడ్డి వివాహం చాలా ఘనంగా జరిగింది. అయితే అల్లు అర్జున్ స్నేహ రెడ్డిని వివాహం చేసుకోవటానికి చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. సాధారణంగా హీరో హీరోయిన్లు తమతో పాటు నటించిన వారితో ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకుంటూ ఉంటారు. కానీ అల్లు అర్జున్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందినప్పటికీ సినిమా ఇండస్ట్రీతో ఏమాత్రం సంబంధంలేని స్నేహ రెడ్డితో ప్రేమలో పడ్డాడు. ఆ తర్వాత తమ ప్రేమ గురించి కుటుంబ సభ్యులకు వివరించి వారి అంగీకారంతో స్నేహారెడ్డిని వివాహం చేసుకున్నాడు.

అయితే బన్నీ ప్రేమ విషయాన్ని అంగీకరించిన అతని తల్లి పెళ్లి విషయంలో మాత్రం స్నేహారెడ్డికి కొన్ని కండిషన్స్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. స్నేహ రెడ్డి కూడా తన అత్తగారి కండిషన్స్ కి ఒప్పుకొని అల్లు అర్జున్ ని వివాహం చేసుకుంది. ప్రస్తుత కాలంలో వివాహం జరిగిన వెంటనే పిల్లల్ని కనటానికి ఎవరు ఆసక్తి చూపరు. అందువల్ల అల్లు అర్జున్ తల్లి వివాహమైన వెంటనే పిల్లలని కని తమ వంశానికి వారసులను ఇవ్వాలని స్నేహ రెడ్డికి కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. అందువల్ల స్నేహ రెడ్డి తన అత్తగారి కండిషన్స్ కి లోబడి పిల్లల కోసం ఎటువంటి ప్లానింగ్స్ లేకుండా పెళ్లి జరిగిన మూడు సంవత్సరాలకే అల్లు అయాన్ కి జన్మనిచ్చి అల్లు కుటుంబానికి వారసుడిని ఇచ్చి తన అత్తగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంది.