టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి గురించి తెలియనివారట్టు ఉండరు. హీరోయిన్లకు ఏమాత్రం తీసుకొని అందంతో సందడి చేస్తున్న స్నేహ రెడ్డి అల్లు అర్జున్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైన అల్లు అర్జున్ స్నేహ రెడ్డితో ప్రేమలో పడ్డాడు. అయితే వీరి పెళ్లికి స్నేహ రెడ్డి తండ్రి మొదట నిరాకరించిన ఆ తర్వాత స్నేహ రెడ్డి ప్రేమను అర్థం చేసుకొని అల్లు అర్జున్ తో పెళ్లికి అంగీకరించాడు. ఈ క్రమంలో 2011లో వీరిద్దరికి ఘనంగా పెళ్లి జరిపించారు.
అయితే పెళ్లి జరిగిన తర్వాత అల్లు అర్జున్ తల్లి నిర్మల స్నేహ రెడ్డికి ఒక కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఆ కండిషన్ ఏమిటంటే.. పెళ్లి అయిన వెంటనే పిల్లల కోసం ప్లాన్ చేయకుండా వెంటనే పిల్లల్ని కనాలని స్నేహ రెడ్డికి కండిషన్ పెట్టిందట. ఎందుకంటే ఈరోజుల్లో మహిళలు ఆధునికతకు బాగా అలవాటు పడి పెళ్ళి జరిగి సంవత్సరాలు గడుస్తున్నా కూడా పిల్లల్ని కనటానికి ఆసక్తి చూపటం లేదు. అందువల్ల అల్లు అర్జున్ తల్లి నిర్మల స్నేహ రెడ్డికి ఈ కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. 2011లో వీరికి పెళ్లి జరగగా 2014లో కుమారుడు అయాన్ కి స్నేహ రెడ్డి జన్మనిచ్చింది. ఆ తర్వాత 2016లో కూతురు అర్హ జన్మించింది.
ప్రస్తుతం తమ పిల్లలతో కలిసి అల్లు అర్జున్, స్నేహ రెడ్డీ ఎంతో సంతోషంగా జీవితాన్ని నడుపుతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల స్నేహ రెడ్డి కూడా తన గ్లామర్ డోస్ బాగా పెంచినట్లు కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు హీరోయిన్స్కి ఏమాత్రం తగ్గకుండా ఉన్నాయి. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే… ఇటీవల పుష్ప సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అల్లు అర్జున్ ఇక ఎప్పుడు పుష్ప 2 సినిమా షూటింగ్ లో పాల్గొనటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. తొందర్లోనే పుష్ప 2 సినిమా షూటింగ్ పట్టాలెక్కనుంది.