ప్రభాస్ అభిమానుల్ని గట్టిగా కెలికేస్తున్న అల్లు అర్జున్ అభిమానులు.!

తగ్గేదే లే.. అంటున్నారు అల్లు అర్జున్ అభిమానులు, ప్రభాస్ అభిమానుల్ని కెలకడంలో. ప్రభాస్ అంటే సినీ పరిశ్రమలో అందరికీ డార్లింగ్.! దాదాపుగా ప్రభాస్‌ని ఇష్టపడనోళ్ళెవరూ వుండరు.. అల్లు అర్జున్ సహా. కానీ, అల్లు అర్జున్ అభిమానులకి అందరూ శతృవులే. ఎవరితోనూ కలిసి వుండరు అల్లు అర్జున్ అభిమానులు. మెగా కాంపౌండ్‌లో చీలిక తెచ్చిందే ఈ అల్లు అర్జున్ అభిమానులు. దానికి ఆర్మీ అని పేరు పెట్టి, అల్లు అర్జున్ కూడా ఆ హార్డ్ కోర్ ఫాన్స్‌ని ‘సైకోల్లా’ మార్చేస్తున్నాడన్న విమర్శలు లేకపోలేదు.

ప్రభాస్ మార్ఫింగ్ ఫొటోలతో అల్లు అర్జున్ అభిమానులు గత కొద్ది కాలంగా చేస్తున్న యాగీ అంతా ఇంతా కాదు. అదిప్పుడు మరింత శృతి మించిపోయింది. ప్రభాస్, అల్లు అర్జున్.. ఇద్దరూ మీడియా ముందుకొచ్చి చెప్పినా, ఆ ఇద్దరు హీరోల అభిమానులూ తగ్గేలా లేరు. అల్లు అర్జున్ అభిమానులకి ప్రభాస్ అభిమానులు కూడా గట్టిగానే కౌంటర్ ఎటాక్ ఇస్తున్నారు.

అల్లు అర్జున్ సపోర్ట్ లేకుండా అతని అభిమానులు ఇంతలా పేట్రేగిపోతారా.? ఛాన్సే లేదు. అల్లు అర్జున్ ఈ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.