హైదరాబాదులోని పుష్ప రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి చెందిన సంగతి తెలిసిందే ఈ విషయంలో అల్లు అర్జున్ ని అరెస్టు చేయడం తర్వాత అల్లు అర్జున్ బెయిల్ పై విడుదల కావడం అందరికీ తెలిసిందే. అయితే మంగళవారం పోలీసులు అల్లు అర్జున్ ని మరొకసారి విచారించారు. మొత్తం 3: 35 నిమిషాల పాటు అల్లు అర్జున్ ని పోలీసులు విచారించారు. అల్లు అర్జున్ పోలీసుల ప్రశ్నలకి సమాధానంగా థియేటర్ లోపల చీకటిగా ఉన్నందున అర్థం కాలేదని సమాచారం ఇచ్చారు.
తన వల్ల కొన్ని మిస్టేక్స్ జరిగినట్లు అల్లు అర్జున్ ఒప్పుకున్నారని సమాచారం. మళ్లీ విచారణ పిలిస్తే ఎప్పుడైనా హాజరవుతానని అల్లు అర్జున్ చెప్పారు. అయితే విచారణ సమయంలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటనపై పోలీసులు తయారుచేసిన వీడియో చూసిన అల్లు అర్జున్ కొంత భావోద్వేగానికి లోనయ్యారని సమాచారం. విచారణ సమయంలో అర్జున్ తన వెంట తెచ్చుకున్న టి, బిస్కెట్స్, డ్రై ఫ్రూట్స్ తిన్నట్టు తెలుస్తోంది. అలాగే మూడుసార్లు మంచినీళ్లు తాగినట్లు తెలుస్తోంది.
సెంట్రల్ జోన్ డిసిపి ఆకాంక్ష్ యాదవ్, ఏసీపీ రమేష్, సిఐ రాజులు అల్లు అర్జున్ ని విచారించారు. అతని స్టేట్మెంట్ ని రికార్డు కూడా చేశారు. అయితే సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కేసేలాట కేశవ్ రోజుకొక మలుపు తిరుగుతోంది. అల్లు అర్జున్ తో పాటు అతని వ్యక్తిగత సిబ్బంది బౌన్సర్ని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే అయితే తాజాగా మైత్రి మూవీ మేకర్స్ పై కూడా పోలీసులు కేసులు నమోదు చేయడం సంచలనంగా మారింది.
ఏ 18 గా మైత్రి మూవీ మేకర్స్ పేరుని ఎఫ్ఐఆర్ నమోదు చేయటంతో నిర్మాతలు కూడా విచారణకు హాజరు కావాల్సి ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో ఏ 1 నుంచి ఏ 8 వరకు సంధ్య థియేటర్ యజమాన్యం, ఏ 9 ఏ 10 సంధ్యా థియేటర్ సెక్యూరిటీ సిబ్బంది, ఫ్లోరించార్జ్. ఏ 11 నటుడు అల్లు అర్జున్, ఏ 12 నుంచి ఏ 17 వరకు అల్లు అర్జున్ బౌన్సర్లను చేర్చిన పోలీసులు ఏ 18 గా మైత్రి మూవీ మేకర్స్ ని పేర్కొన్నారు.