సూపర్ స్టార్ మహేష్ బాబు థియేటర్స్ బిజినెస్ లోకి దిగి ఇప్పటికే గడ్చిబౌలీలో ఏఎంబి మాల్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో హైయెస్ట్ టికెట్ రెట్లు ఉండేది ఈ థియేటర్స్ లోనే మొత్తం ఆరు స్క్రీన్స్ ఈ మాల్ లో ఉంటాయి. ఏషియన్ మూవీస్ వారితో కలిసి మహేష్ బాబు ఈ మాల్ నిర్మించారు. ప్రతుతం దీనికి అత్యధిక ఆదరణ లభిస్తోంది.
సెలబ్రిటీ షోలు కూడా ఇక్కడ వేస్తూ ఉంటారు. అలాగే ఈ ఏఎంబి మాల్ లో చాలా సినిమాలకి సంబందించిన ప్రమోషన్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. ఒకప్పుడు ప్రసాద్ ఐమ్యాక్స్ ఉంటే దానిని ఏఎంబి మాల్ బీట్ చేసింది. ఇప్పుడు మరో స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అమీర్ పేట జంక్షన్ లో సత్యం థియేటర్ ని తీసుకొని ఎఎఎ మల్టీప్లెక్స్ గా మార్చేశారు. ఏషియన్ మూవీస్ వారితోనే కలిసి దీనిని నిర్మించారు.
ఇప్పటికే మెజారిటీ వర్క్ కంప్లీట్ అయిపొయింది. ఆదిపురుష్ రిలీజ్ తో ఈ ఎఎఎ మాల్ ఓపెన్ కానుంది. ప్రస్తుతం థియేటర్స్ కి సంబంధించి అన్ని ఇంటీరియర్ వర్క్స్ శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. అయితే ఆంబియన్స్ పరంగా ఇప్పటి వరకు ఏఎంబి మాల్ ఎక్కువ మందికి కనెక్ట్ అయ్యింది. టికెట్ రెట్లు ఎక్కువగా ఉన్నా కూడా ప్రేక్షకులు మాత్రం అధిక సంఖ్యలో ఈ థియేటర్స్ లో సినిమాలు చూడటానికి క్యూ కడుతున్నారు.
ఇక ఐకాన్ స్టార్ ఎఎఎ మాల్ కూడా ఏఎంబితో పోటీ పడేలానే ఉంది. ఇక వేళ అదే జరిగితే ఈ థియేటర్స్ కి ప్రేక్షకుల తాకిడి ఎక్కువ అవుతుంది. అసలే అమీర్ పీటలో సత్యం థియేటర్ లైన్ కాస్తా ఇరుకుగా ఉంటుంది. ఒక వేళ ఎఎఎ మల్టీ ప్లెక్స్ థియేటర్స్ ఓపెన్ అయితే ట్రాఫిక్ అంతరాయం ఎక్కువ అవుతుందని భావిస్తున్నారు.
బయటి నుంచి సత్యం ఎఎఎ చూడటానికి భాగానే ఉంది. అమీర్ పేట ఏరియాలో ఎక్కువగా స్టూడెంట్స్ ఉంటారు. టికెట్ ధరలు బట్టి థియేటర్స్ కి వచ్చే ఆడియన్స్ ఫ్లో ఉంటుందని చెప్పొచ్చు. గడ్చిబౌలీ తరహాలో టికెట్ ధరలు ఎక్కువగా ఉంటే ఏ మేరకు ఐకాన్ స్టార్ మాల్ కి డిమాండ్ ఉంటుందనేది చూడాలి.