అల్లు రామలింగయ్య ఫోటోని షేర్ చేసిన అల్లు అర్జున్… భారీగా ట్రోల్ చేస్తున్న యాంటీ ఫ్యాన్స్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్థాయిలో విపరీతమైన పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా ద్వారా ఈయనకు నార్త్ నుంచి సౌత్ వరకు ఫుల్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇకపోతే కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే అల్లు అర్జున్ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఆయనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు.ఈ క్రమంలోనే ఈయన తన తాతయ్య అల్లు రామలింగయ్య ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా పైన గోడకు వేలాడుతూ ఉన్న తన తాతయ్య ఫోటోని అలాగే కింద తాను ఆ ఫోటోని తీస్తూ ఉన్నట్టు కనిపించేలా ఉండే ఫోటోని షేర్ చేశారు. ఈ విధంగా ఈ ఫోటోని షేర్ చేస్తూ మా ఫౌండేషన్ అని క్యాప్షన్ పెట్టారు.ఈ విధంగా అల్లు అర్జున్ తన తాతయ్య ఫోటోని షేర్ చేయడంతో అల్లు అర్జున్ అభిమానులు ఈ ఫోటోని పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నారు. అయితే ఈ ఫోటో వైరల్ కావడంతో యాంటీ ఫ్యాన్స్ మాత్రం పెద్ద ఎత్తున అల్లు అర్జున్ ను ట్రోల్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే గతంలో అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడుతూ తాము ఇండస్ట్రీలోకి రావడానికి తన మామయ్య చిరంజీవి కారణమని ఆయన మహావృక్షం అయితే ఆయన కింద మేమంతా పెరిగామని ఆయన ద్వారానే ఈ స్థాయిలో ఉన్నాము అంటూ తన మామయ్య గురించి ఎంతో గొప్పగా చెబుతున్నటువంటి వీడియో క్లిప్స్ షేర్ చేస్తూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. గతంలో తమకు సినీ పునాది కల్పించినది మెగాస్టార్ అని చెప్పిన అల్లు అర్జున్ ప్రస్తుతం మాత్రం అల్లు రామలింగయ్య పేరు చెబుతూ మాట మారుస్తున్నారని దారుణంగా ఈయనని ట్రోల్ చేస్తున్నారు.