పుష్ప కోసం యాస, వేషం మార్చనున్న బన్నీ!

Allu Arjun in Pushpa

ఈ పాత్ర చేసిన ఆ పాత్రకి వంద శాతం న్యాయం చేస్తాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.తన రాబోయే చిత్రం పుష్పా కోసం చిత్తూరు యాసను నేర్చుకోవడం ప్రారంభించిన అల్లు అర్జున్ కరోనా మహమ్మారి కారణంగా దాన్ని ఆపాడు. ఇప్పుడు స్టైలిష్ స్టార్ తిరిగి తన ఇంట్లో చిత్తూరు యాసను అభ్యసించడం ప్రారంభించాడు.

Allu Arjun

ప్రస్తుతం రాయలసీమ యాసలో నిపుణులైన ట్యూటర్లను నియమించుకున్నాడు అల్లు అర్జున్. వచ్చే నెలలో రాజమండ్రిలోని మారేడిమల్లి అడవిలో ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొంటాడు .

యాసే కాకుండా వేషంలో కూడా తన మార్కు ను తన అభిమానులకు చూపించబోతున్నాడు అల్లు అర్జున్. ఎర్రచందనం స్ముగ్గ్లింగ్ నేపధ్యంలో చిత్తూరు ప్రాంతంలో జరిగిన ఒక ఎన్కౌంటర్ ఆధారంగా రూపొందుతున్న సినిమా అని ఉహాగానాలున్నాయి. అందుకే అల్లు అర్జున్ చిత్తూరు యాసతో పాటు తమిళ నాడు ఆంధ్ర బోర్డర్లో కురాళ్ళ వేషంలో కనిపించబోతున్నాడట.