‘పుష్ప’ కోసం మెగాస్టార్ చిరంజీవి రీమిక్స్ సాంగ్.!

రీమిక్స్ సాంగ్స్ ట్రెండ్ ఎప్పటి నుంచో వుంది. ఇప్పటికే పలు సూపర్ హిట్ సాంగ్స్ రీమిక్స్ రూపంలో మరోసారి సూపర్ హిట్ అయిన సందర్భాలున్నాయ్. ఇక, మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ పాటలపై ఎప్పుడూ నేటి జనరేషన్ హీరోల కన్నుంటుంది. ఈపాటికే మెగా కాంపౌండ్ నుంచి సాయి ధరమ్ తేజ్, రామ్ చరణ్ తదితరులు మెగాస్టార్ సాంగ్స్‌ని రీమిక్స్ చేసి సక్సెస్ అయ్యారు.

ఇక, ఇప్పుడు అల్లు అర్జున్ వంతు వచ్చింది. ‘పుష్ప 2’ సినిమా కోసం అల్లు అర్జున్ ఓ సాంగ్ రీమిక్స్ ప్లాన్ చేస్తున్నాడట. మెగాస్టార్ చిరంజీవి సూపర్ హిట్ సినిమాలోని సూపర్ పాపులర్ సాంగ్‌ని రీమిక్స్ చేయాలనుకుంటున్నాడట. అయితే, అది ఫుల్ సాంగ్ కాదనీ తెలుస్తోంది. ఓ చిన్న బిట్ సాంగ్‌లా వుండబోతోందనీ ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారం.

అల్లు అర్జున్ మంచి డాన్సర్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాలా.? బహుశా ఓ మాంచి మాస్ బీటున్న సాంగ్ బిట్‌నే బన్నీ రీమిక్స్ చేసే అవకాశాలున్నాయ్. చూడాలి మరి, చిరంజీవి సూపర్ హిట్స్‌ నుంచి ఏ సాంగ్‌ని సెలెక్ట్ చేసుకోనున్నాడో బన్నీ.!