అఖండ ప్రీ రిలీజ్ వేడుకలో సందడి చేసిన ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్!

నందమూరి నటసింహం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న అఖండ సినిమా గురించి మనకు తెలిసిందే. ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీ విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇక పోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను శిల్పకళా వేదికలో నిర్వహించారు. ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి ఎంతో మంది సినీ ప్రముఖులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ వస్తున్నాడంటూ గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు వినిపించడంతో అల్లు అభిమానులు ఎంతో సంతోషపడ్డారు. ఇక ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ రావడంతో అభిమానులు ఒక్కసారిగా కేకలు వేస్తూ సందడి చేశారు. ఇలా ఒకే వేదికపై బాలకృష్ణ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని చూడటంతో అభిమానులు ఎంతో సంతోషపడ్డారు. ఇకపోతే ఇందులో బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నారు.

ఇది వరకు ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, పోస్టర్ లు, సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.ఈ క్రమంలోనే ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటిస్తున్నారు. ఇదివరకే బాలకృష్ణ బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కిన లెజెండ్, సింహా వంటి చిత్రాలు భారీ కలెక్షన్లను రాబట్టాయి. ఈ క్రమంలోనే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.ఇక ఇందులో హీరో శ్రీకాంత్ విలన్ పాత్రలో సందడి చేయనున్నారు.