ఊర్వశివో రాక్షసివో సక్సెస్ మీట్ లో కంటతడి పెట్టుకున్న అల్లు అర్జున్.. ఫోటోలు వైరల్!

అల్లు శిరీష్ హీరోగా నటించిన ఊర్వశివో రాక్షసివో సినిమా నవంబర్ 4వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. రాకేష్ శశి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా లవ్ అండ్ రొమాంటిక్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమాని యువత ఎంతగానో ఆదరించారు. ఇలా మూడు సంవత్సరాల తర్వాత ఈ సినిమా విడుదల కావడంతో ఈ సినిమాకి ఎంతో మంచి సక్సెస్ అందించారు. ఇక ఈ సినిమా విజయం కావడంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు శిరీష్ వేదికపై మాట్లాడుతున్న సమయంలో అల్లు అర్జున్ ఒక్కసారిగా కంటతడి పెట్టుకున్నారు.

అల్లు శిరీష్ వేదికపై అల్లు అర్జున్ గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్ కి తాను తమ్ముడిగా పుట్టడం నిజంగా తన అదృష్టమని తెలిపారు.అన్నయ్య తనని ఎప్పుడు కూడా ఒక తమ్ముడిగా ట్రీట్ చేయలేదని ఎప్పుడు తన కొడుకుగానే తనని ట్రీట్ చేశారని తెలిపారు. తను సోషల్ మీడియా వేదికగా ఏ పోస్ట్ పెట్టిన మై డియర్ బేబీ సిరి అంటూ పోస్ట్ చేస్తారని ఈయన తెలిపారు. ఇక చాలా రోజుల తర్వాత నేను కనుక అన్నయ్యని కలిస్తే ఆయన నా బుగ్గలు గిల్లి చిన్నపిల్లడిలా ముద్దు చేస్తారని ఈ సందర్భంగా అల్లు అర్జున్ తో తనకు ఉన్నటువంటి రిలేషన్ గురించి బయటపెట్టారు.

ఇకపోతే తాను తన జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే అన్నయ్యనాకు కావాల్సినవన్నీ ముందే చేసి పెట్టారని అందుకు అన్నయ్యకు థాంక్స్ అంటూ ఈ సందర్భంగా అల్లు అర్జున్ గురించి అల్లు శిరీష్ ఎంతో గొప్పగా చెప్పడంతో ఒక్కసారిగా అల్లు అర్జున్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.