బిగ్ ప్లాన్ లో అల్లు అర్జున్..టార్గెట్ బాలీవుడ్.!

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 తో బిజీగా ఉన్నారు. ఆయన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఆ సినిమా సక్సెస్ తో అల్లు అర్జున్ పేరు మార్మోగిపోయింది. ఈ సినిమా విడుదలై చాలా కాలం అవుతున్నా ఇంకా ఆ మూవీ క్రేజ్ తగ్గలేదు. త్వరలోనే పుష్ప రెండో భాగం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే, ఈ క్రమంలో అల్లు అర్జున్ మరో పెద్ద ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

ఆయన తన కెరీర్ ని నెక్ట్స్ లెవల్ కి తీసుకువెళ్లాలని ప్లాన్ వస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ లో అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం మొదలైంది. ఈ క్రమంలోనే ఆయన జియో స్టూడియోస్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తన డ్రీమ్ సినిమా ‘ద ఇమ్మోర్టల్ అశ్వత్థామ’ సినిమాలో టైటిల్ రోల్ అల్లు అర్జున్ చేయాలని అనుకుంటున్నారట. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ని ఎప్పటి నుంచో సంప్రదిస్తున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. కాగా, ఇప్పుడు అందులో నటించడానికి ఆయన ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

అశ్వత్థామ సినిమా తీయాలి అనేది ఆదిత్య ధర్ కల. ఈ మూవీని నిర్మించడానికి జియో స్టూడియోస్ ముందుకు వచ్చింది. మొదట ఈ సినిమా కోసం బాలీవుడ్ హీరోలను సంప్రదించారట. వారు ముందు అంగీకరించి, తర్వాత వదిలేశారు. ఈ కథ కోసం దర్శకుడు ఆదిత్య ధర్ దాదాపు ఐదు సంవత్సరాలుగా కష్టపడ్డాడట. తీరా కథను తెరకెక్కిద్దామంటే ఒకసారి కరోనా వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు నటీనటుల కోసం తర్జన పడుతున్నారు. మహాభారతంలోని అశ్వద్ధాముడి ఆధారంగా చేసుకొని ఈ కథను తయారు చేశారు.

కాగా, జియో సంస్థ వచ్చి అల్లు అర్జున్ తో మాట్లాటారు. బాగా ఆలోచించి ఈ కథ చేయడానికి అల్లు అర్జున్ అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన బిజీగా ఉండటం వల్ల ఈ ప్రాజెక్టు పట్టాలు ఎక్కడానికి మరికాస్త్ సమయం పట్టవచ్చు. అయితే, ఈ మూవీ కనుక హిట్ అయితే అల్లు అర్జున్ కి ఇతర తిరుగు ఉండదు. ఇప్పటి వరకు అశ్శదాముడి కథను చూపించలేదు. మరి దర్శకుడి ఈ కథను ముఖ్యంగా అల్లు అర్జున్ ని ఎలా చూపిస్తారా అనే ఆసక్తి మొదలైంది.

ఇదిలా ఉండగా, అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్‌తో పుష్ప: ది రూల్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది చివరి వరకు ఈ సినిమా షూటింగ్ జరగనుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ తో ఓసినిమా చేయాల్సి ఉంది. తర్వాత సందీప్ రెడ్డి వంగాతో ఓ సినిమా అంగీకరించారు. డైరెక్టర్ అట్లీతో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ బాలీవుడ్ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చే అవకాశం ఉంది.