అల్లు అర్జున్‌కు పోటీ ఇస్తున్న స‌తీమ‌ణి.. ఏ విష‌యంలోనో తెలిస్తే నోరెళ్ళ‌పెడ‌తారు!

ప్ర‌స్తుతం టాలీవుడ్ టాప్ హీరోల‌లో ఒకరిగా ఉన్న అల్లు అర్జున్ ఈ ఏడాది అల వైకుంఠ‌పుర‌ములో చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. ఈ సినిమా ఇచ్చిన స‌క్సెస్ అల్లు అర్జున్‌కి మ‌రింత జోష్ అందించింది. ఇదే ఉత్సాహంతో పుష్ప అనే సినిమా మొద‌లు పెట్టాడు. కాని కరోనా వ‌ల‌న ఈ సినిమాకి బ్రేక్ ప‌డింది. అయితే ఈ రోజు నుండి పుష్ప షూటింగ్ వైజాగ్‌లో జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తుండగా, సుకుమార్ కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్న‌ట్టు తెలుస్తుంది.

ఈ కాలం నాటి హీరో, హీరోయిన్స్ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవ‌డం కోసం గంట‌ల త‌ర‌బ‌డి జిమ్‌లో కస‌ర‌త్తులు చేస్తున్నారు. ఆరుప‌దుల వ‌య‌స్సు వ‌చ్చిన నాగార్జున కూడా ఎల్ల‌ప్పుడు జిమ్ చేస్తూనే ఉంటారు. అయితే ప్ర‌తి విష‌యంలోను ఎంతో స్టైలిష్‌గా ఉండే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ రీసెంట్‌గా త‌న స‌తీమ‌ణి స్నేహా రెడ్డితో క‌లిసి జిమ్ చేశారు. జీవితంలోనే కాదు జిమ్‌లోను భాగ‌స్వామిగా ఉన్న‌ స్నేహారెడ్డి.. బ‌న్నీకి గ‌‌ట్టి పోటి ఇస్తూ వ‌ర్కవుట్స్ చేస్తున్న‌ట్టు ఈ వీడియోని చూస్తుంటే తెలుస్తుంది. స్నేహ ట్రెడ్‌మిల్‌లో చేస్తండ‌గా, స్టైలిష్ స్టార్ లెగ్ వ్యాయామం చేయడం వీడియోలో గ‌మ‌నించ‌వచ్చు.

సోష‌ల్ మీడియాలో చాలా చురుకుగా ఉండే స్నేహా రెడ్డి హాలోవీన్ డే సంద‌ర్భంగా త‌న పిల్ల‌ల‌ని వైరైటీ గెట‌ప్స్‌లోకి మార్చి వారి ఫోటోల‌ని సోష‌ల్ మీడియ‌లో షేర్ చేసింది. అయాన్, అర్హ‌లు భ‌య‌పెట్టించే ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ చిన్నారులు నెటిజ‌న్స్‌కు తెగ ముద్దొస్తున్నారు. వారి ఫోటోలు అంత‌ర్జాలంలో తెగ వైర‌ల్ అయ్యాయి.