మరో అవార్డుకు ఎంపికైన అల్లు అర్జున్… ఈ అవార్డు అందుకోనున్న తొలి తెలుగు హీరో?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు పొందారు.పుష్ప సినిమాకు ముందు వరకు ఈయన కేవలం దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో మాత్రమే హీరోగా పేరు ప్రఖ్యాతలు పొందారు అయితే పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ పొందారు. ఈ విధంగా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన అల్లు అర్జున్ కు నార్త్ సౌత్ అనే తేడా లేకుండా అభిమానులు కూడా పెరిగిపోయారు.

ఇకపోతే అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాకు గాను ఇప్పటికీ ఎన్నో అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమాలో నటించినందుకుగాను ఈయనకు ఉత్తమ నటుడిగా సైమా అవార్డు ఫిలింఫేర్ అవార్డులు దక్కాయి. అదే విధంగా ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఇలా ఈ అవార్డును సొంతం చేసుకున్న తొలి దక్షిణాది సినీ హీరోగా అల్లు అర్జున్ రికార్డు సృష్టించారు. ఇలా ఎన్నో అద్భుతమైన అవార్డులను అందుకున్నటువంటి ఈయన తాజాగా మరో అరుదైన గొప్ప అవార్డుకు ఎంపికయ్యారు.

తాజాగా అల్లుఅర్జున్‎ను ప్రతిష్టాత్మక GQ MOTY-2022 ‘లీడింగ్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్’ అవార్డుకి ఎంపికయ్యారు.అయితే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును ఇప్పటివరకు ఏ తెలుగు హీరో కూడా అందుకోలేదు ఇలాంటి అవార్డు సొంతం చేసుకున్న తొలి తెలుగు హీరోగా అల్లు అర్జున్ మరొక రికార్డు సృష్టించారు.ఇక అల్లు అర్జున్ ఇలాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డుకు ఎంపికయ్యారనే విషయం తెలియగానే అల్లు అర్జున్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన హీరోకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.