స్టార్ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి అండ లేకుండా పాన్ ఇండియా సినిమా దగ్గర సాలిడ్ మార్కెట్ తెచ్చుకున్న ఏకైక తెలుగు హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది డెఫినెట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పాలి. పుష్ప 1 కి హిందీలో వచ్చిన ప్రతి పైసా కూడా అల్లు అర్జున్ వలనే వచ్చింది అని చెప్పడంలో సందేహం లేదు.
అలాగే పుష్ప 2 కి కూడా ఇంత హైప్ రావడానికి కారణం కూడా బన్నీ నే. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ నటిస్తున్న భారీ చిత్రాలు అన్నీ పాన్ ఇండియావే కాగా వాటిలో లేటెస్ట్ గా దర్శకుడు త్రివిక్రమ్ తో భారీ చిత్రం ఇపుడు అనౌన్స్ అయ్యింది. త్రివిక్రమ్ కెరీర్ లో ఇది మొదటి పాన్ ఇండియా సినిమా కాగా దీనిని అయితే భారీ సోషియో ఫాంటసీ డ్రామాగా అయితే చేస్తున్నట్టుగా టాక్ వచ్చింది.
మరి ఈ సినిమాపై ఇప్పుడు మరో రూమర్ అయితే వినిపిస్తుంది. ఈ చిత్రం మొదట బన్నీ కోసం రాసుకున్నది కాదు అని ఎన్టీఆర్ తో గతంలో చేసి ఆగిపోయిన భారీ చిత్రం అని తెలుస్తుంది. ఎన్టీఆర్ తో 30వ సినిమాగా అయితే త్రివిక్రమ్ మొదటి పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేశారు.
కానీ అది ఆగిపోయింది. సో ఇపుడు అది అల్లు అర్జున్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ అంశం ఏమిటంటే కొరటాల శివ బన్నీ కి ప్లాన్ చేసిన దేవర సినిమా ఎన్టీఆర్ కి వెళ్లగా ఎన్టీఆర్ సినిమా బన్నీకి వచ్చినట్టు అయ్యిందని చెప్పాలి.