“ఐకాన్” కథను దర్శకుడు వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ కంటే ముందే రాసుకున్నాడు. అయితే దీని నిర్మాణం నటీనటుల ఎంపిక పరంగా కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ కథలో మొదట అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో పోషించాలని అనుకున్నారు. అయితే అతను కథ యొక్క బౌండ్ స్క్రిప్ట్‌తో అంతగా సంతృప్తి చెందలేదు. దీంతో ఫైనల్ గా సినిమా స్క్రిప్ట్‌ను తిరస్కరించినట్లు సమాచారం.
ఇక ఆ తరువాత ఐకాన్ కథలో ప్రధాన పాత్ర కోసం నటుడు రామ్ పోతినేనిని ఎంచుకున్నారు. అయితే వివిధ కారణాల వల్ల ప్రాజెక్ట్ ఆలస్యం అయింది. దీంతో సినిమా భవితవ్యం ఎలా ఉంటుందో, చివరికి పూర్తి చేసి విడుదల చేస్తారా లేదా అనే ఊహాగానాలకు దారితీసింది. తాజా అప్‌డేట్‌లో నిర్మాతలు దిల్ రాజు వేణు శ్రీరామ్ “ఐకాన్” కోసం మరొక హీరోను సంప్రదించినట్లు టాక్.
ఐకాన్ కోసం ఈసారి నితిన్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే ఐకాన్ ఫుల్ స్క్రిప్ట్ కు నితిన్ అంగీకరించాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. సినిమా తారాగణం లేదా మేకింగ్ లో మరిన్ని మార్పులు ఉంటాయా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. మరోవైపు నితిన్ వక్కంతం వంశీతో ఒక మాస్ కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. నితిన్ నుంచి చివరగా వచ్చిన మాచర్ల నియోజకవర్గం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే.