Allu Arjun: బన్నీ పొలిటికల్ ఎంట్రీ… కొట్టి పారేసిన బన్నీ టీం… అన్ని అవాస్తవాలే అంటూ?

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా ద్వారా ఈయన పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా తాజాగా పుష్ప 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా కూడా అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమా ద్వారా మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్న అల్లు అర్జున్ రాజకీయాలలోకి రావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎంతోమంది సినీ ఇండస్ట్రీలో సక్సెస్ అందుకొని రాజకీయాలలోకి వచ్చి రాజకీయాలలో కూడా మంచి సక్సెస్ అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ కూడా రాజకీయాలలోకి రావాలని భావిస్తున్నారని అందుకే ఈయన టీం ప్రశాంత్ కిషోర్ ను కలిసినట్టు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి.

ఇలా ప్రశాంత్ కిషోర్ ని కలవగా ఆయన మాత్రం ఇప్పుడే రాజకీయాలలోకి ఎంట్రీ అవసరం లేదని మరో పదేళ్లపాటు సోషల్ సర్వీస్ చేసిన తర్వాత రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వడం మంచిదని కొన్ని సలహాలు ఇచ్చారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ గురించి వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలా ఈయన పొలిటికల్ ఎంట్రీ గురించి వస్తున్న ఈ వార్తలపై బన్నీ టీమ్ స్పందించారు. ఈ సందర్భంగా అధికారికంగా ఒక లెటర్ కూడా విడుదల చేశారు. తాను పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నట్టు వస్తున్న వార్తలలో ఏమాత్రం నిజం లేదని తాను రాజకీయాలలోకి రావాలనే ఉద్దేశంతో ఎవరిని కలవలేదనీ, ఎవరితోనూ సలహాలు తీసుకోలేదు అంటూ ఈయన క్లారిటీ ఇచ్చారు. తన పొలిటికల్ ఎంట్రీ గురించి వస్తున్న వార్తలన్నీ కూడా పూర్తిగా ఆవాస్తవమేనని ఎవరు కూడా ఈ వార్తలను నమ్మొద్దు అంటూ క్లారిటీ ఇచ్చారు దీంతో ఈ వార్తలకు చెక్ పడింది.