పీ ఆర్ టీమ్ పరంగా చూస్తే ఇప్పుడున్న టాలీవుడ్ హీరోలందరిలోకీ అల్లు అర్జున్ చాలా పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నాడు. టాలీవుడ్‌లో ఎవ్వరూ చేయనంత ఖర్చు చేస్తున్నాడట.
అల్లు అర్జున్‌కి అన్నీ అలా కలిసొస్తున్నాయి. అనూహ్యంగా జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం దక్కింది. ఇదేదో ఆషా మాషీ గౌరవం కాదు.
టాలీవుడ్‌లో ఓ న్యూ హిస్టరీ క్రియేట్ చేశాడు అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా. ఒకప్పుడు అల్లు అర్జున్ అంటే మెగా కాంపౌండ్ హీరో. జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నాకా ఈక్వేషన్స్ మారిపోయాయ్. ఇప్పుడు అల్లు అర్జున్ అంటే అదో బ్రాండ్ అంతే. ‘ బ్రాండ్ అల్లు..’
అలాగని మెగా ఇమేజ్‌ని వదులుకోవడానికి అల్లు అర్జున్ ఇష్టపడడం లేదు. తానెప్పుడూ మెగాస్టార్ చిరంజీవి అభిమానినే. ఆయనకు విధేయుడినే అంటుంటారాయన. ఆయన సినిమాలు చూస్తూ ఇన్‌స్పైర్ అయ్యి పెరిగానని ఓ సాధారణ మెగాస్టార్ చిరంజీవి అభిమాని తరహాలోనే మాట్లాడుతుంటాడు అల్లు అర్జున్.
కానీ, కొంతమంది అల్లు అర్జున్ అభిమానుల ముసుగులో మెగా కాంపౌండ్ నుంచి అల్లు అర్జున్‌ని వేరుగా చూస్తున్నారు. అనవసరమైన గాసిప్స్ క్రియేట్ చేస్తూ, మెగా కాంపౌండ్ నుంచి అల్లు అర్జున్‌ని సెపరేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, తాను ఏమాత్రం తొనగకుండా తానెప్పటికీ మెగా హీరోనే అని చెప్పుకుంటున్నాడు అల్లు అర్జున్.
అయితే, ఒక వైపు ఆ మెగా బ్రాండ్ కొనసాగిస్తూనే, ‘అల్లు’ అనే బ్రాండ్‌ని ఇంకాస్త హైలైట్ చేసుకుంటున్నాడు కూడా. అల్లు అర్జున్‌లోని ఈ సరికొత్త మార్కెటింగ్ టెక్నిక్స్ టాలీవుడ్‌లో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయ్.
రానున్న రోజుల్లో ఇంటర్నేషనల్ లెవల్‌లో తన బ్రాండ్‌ని విస్తరించుకోబోతున్నాడుట అల్లు అర్జున్. చూడాలి మరి.