గ్యాప్ తగ్గించేందుకు ట్రై చేస్తున్న అల్లు అర్జున్.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా మెగా కాంపౌండ్ అలాగే అల్లు కాంపౌండ్ మధ్య గ్యాప్ ఏర్పడింది.. అది పెద్దదవుతూ వస్తోంది. అల్లు అర్జున్ అభిమానులే దీనికి కారణం. ‘అల్లు అర్జున్ ఆర్మీ’ పేరుతో కొందరు ఈ మధ్య వేస్తోన్న వెకిలి వేషాలు అత్యంత అసభ్యకరంగా మారుతున్నాయ్. ‘అదరికీ అభిమానులుంటే..

నాకు ఆర్మీ వుంది’ అని అల్లు అర్జున్ చెప్పడంతో, ఆ ఆర్మీ పేరుతో అల్లు అర్జున్ అభిమానులు మరింతగా రెచ్చిపోతున్నారు. ‘ఎవడ్నీ లెక్క చేయం..’  అంటూ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌లనీ తూలనాడుతున్నారు ఆ సోకాల్డ్ ఆర్మీ పేరుతో అభిమానులు. ఈ విషయమై అల్లు అరవింద్ కూడా ఒకింత ఆందోళన చెందుతున్నారట.

దాంతో, అల్లు అర్జున్ త్వరలోనే అభిమానులతో భేటీ అయి, ‘ఇతర హీరోల అభిమానులతో గొడవలొద్దు’ అని సుద్దులు చెప్పాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అదే గనుక జరిగితే, అది మెగా – అల్లు కాంపౌండ్ల మధ్య గ్యాప్ తగ్గించేందుకు చేపట్టిన చర్యే అవుతుంది. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ అభిమానులతో అల్లు అర్జున్ ఆత్మీయ సమావేశం వుంటుందని అంటున్నారు.