టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తెరపై ఎలా ఉన్నా.. ఎంత పెద్ద స్టార్ అయినా కూడా ఇంట్లోకి రావడంతో సాధారణ ఓ తండ్రిలా మారిపోతాడు. తన పిల్లలతో కలిసి ఆడుకుంటాడు. అర్హ, అయాన్‌లతో కలిసి బన్నీ చేసి అల్లరి అంతా ఇంతా కాదు. ఇప్పటికే ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అయాన్‌తో చేసిన వీడియోలు అంతగా వైరల్ కాకపోయినా.. బుల్లి అర్హ ముద్దు ముద్దు మాటలు మాత్రం అందరినీ కట్టిపడేస్తుంటాయి.
అర్హతో చేసిన క్యూట్ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో సెన్సేషన్ అయ్యాయి. మరీ ముఖ్యంగా అర్హతో పెళ్లి ముచ్చట్లు పెట్టడం, నాన్న చెప్పిన వాడినే పెళ్లి చేసుకుంటాను అని అర్హతో చెప్పించేందుకు బన్నీ తెగ కష్టపడిపోయాడు. ఇంకా కష్టపడుతూనే ఉన్నాడు. కానీ అర్హ మాత్రం బన్నీ తెగ ఆడుకుంటోంది. ఇక దోశ స్టెప్పులంటూ బన్నీ వేసిన రాములో రాముల డ్యాన్స్ మూమెంట్స్‌పై సెటైర్ వేసేసింది.
ఇక ఇప్పుడు బన్నీ పుష్ప షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తన కూతురుని చాలా మిస్ అవుతున్నాడు బన్నీ. అందుకే పాత వీడియోలను చూసుకుంటూ తన అర్హను చూసి ఆనందిస్తున్నట్టున్నాడు. ఈక్రమంలో బన్నీ ఓ వీడియోను షేర్ చేశాడు. ఇందులో అర్హ ఓ ఫన్నీ కొటేషన్‌ను చెప్పింది.. బెండ కాయ్ దొండకాయ్ నువ్ నా గుండె కాయ్ అని ఎంతో క్యూట్‌గా అర్హ చెప్పింది. దీంతో పగలబడి నవ్విన బన్నీ.. మళ్లీ ఓ సారి చెప్పించుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.