ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కో స్పెషల్ ఫ్లైట్.. నిహారిక పెళ్లికి బయల్దేరిన బన్నీ

Allu Arjun Family Off To Udaipur In Special Flight for Niharika Wedding

మెగా డాటర్ నిహారిక పెళ్లి సంబరాలు వారం క్రితమే మొదలయ్యాయి. రాజస్థాన్‌లోని ఉదయ్ పూర్‌లోని ఉదయ విలాస్‌లో డిసెంబర్ 9న రాత్రి జరిగే ఈ వివాహా వేడుకలకు ఒక్కొక్కరుగా అడుగులు ముందుకు వేస్తున్నారు. నేటి ఉదయం ఫ్లైట్‌లో నిహారిక, చైతన్యల కుటుంబాలు వెళ్లాయి. అందులో ఏడుగురు మాత్రమే స్పెషల్‌గా వెళ్లారు. అయితే ఈ పెళ్లి వేడుకలకు అతి తక్కువ మందిని పిలవడం, కోవిడ్ కారణంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

Allu Arjun Family Off To Udaipur In Special Flight for Niharika Wedding
Allu Arjun Family Off To Udaipur In Special Flight for Niharika Wedding

నిహారిక పెళ్లికి వెళ్లే ప్రతీ ఒక్క ఫ్యామిలీ స్పెషల్ ఫ్లైట్‌లోనే వెళ్లినట్టు కనిపిస్తోంది. తాజాగా బన్నీ ఫ్యామిలీ కూడా స్పెషల్ ఫ్లైట్ వేసుకుని ఉదయ్ పూర్‌కు వెళ్లేందుకు రెడీ అయింది. అల్లు అరవింద్, ఆయన భార్య, బన్నీ, స్నేహారెడ్డి ఇద్దరు పిల్లలు ఇలా అందరూ ఓ స్పెషల్ ఫ్లైట్ వేసుకునివెళ్లారు. వీటికి సంబంధించిన ఫోటోలను బన్నీ తాజాగా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్అవుతున్నాయి. గత ఐదారు రోజులుగా జరుగుతున్న నిహారిక పెళ్లి వేడుకల్లోబన్నీ ఫ్యామిలీ అంతగా కనిపించలేదు.

Allu Arjun Family Off To Udaipur In Special Flight for Niharika Wedding
Allu Arjun Family Off To Udaipur In Special Flight for Niharika Wedding

బన్నీ పుష్ప సినిమా షూటింగ్ కోసం మారెడుమిల్లిలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందుకే ఇన్ని రోజులుగా సెలెబ్రేషన్స్‌లో పాల్గొనలేదు. కానీ పెళ్లికి రెండు రోజుల ముందు మాత్రం ఫ్యామిలినీ తీసుకుని బన్నీ వెళ్తున్నాడు. ఇక రామ్ చరణ్, చిరంజీవి కూడా బయల్దేరేందుకు సిద్దంగా ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి నిహారిక పెళ్లిలో స్పెషల్ ఫ్లైట్ కాన్సెప్ట్ మాత్రం బాగానే హాట్ టాపిక్ అవుతోంది. ప్రస్తుతం బన్నీ ఫ్యామిలీ ఫోటో బాగానే వైరల్ అవుతోంది.