Allu Arjun: భార్య పిల్లలతో కలిసి మొబైల్ లెటర్ ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్.. ఫోటో వైరల్!

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ తాజాగా పుష్ప సినిమాతో అద్భుతమైన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సంగతి మనకు తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా హీరోల లిస్టులో చేరిపోయారు. ఇలా పుష్ప సినిమా విజయవంతం కావడంతో అల్లు అర్జున్ తరువాత పుష్ప 2తో బిజీ కానున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది ఈ క్రమంలోనే ఈ ఖాళీ సమయాన్ని అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తనకు ఏమాత్రం సమయం దొరికిన తన భార్య పిల్లలతో కలిసి తన టైం స్పెండ్ చేయడానికి అల్లుఅర్జున్ ఎంతో ఇష్టపడతారు. ఇలా ఏ మాత్రం సమయం దొరికినా విదేశీ పర్యటనలకు వెళ్లడం లేదా తన పిల్లలను కారులో తీసుకొని లాంగ్ డ్రైవ్ కి వెళ్తూ అల్లుఅర్జున్ ఎంజాయ్ చేయడం మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే ప్రస్తుతం పుష్ప విజయం తర్వాత హాలిడే వెకేషన్ లో ఉన్న అల్లు అర్జున్ తన భార్య పిల్లలతో కలిసి ఏకంగా వైల్డ్ టూర్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అటవీ ప్రాంతానికి వెళ్లిన ఈ జంట అక్కడ పిల్లలతో కలిసి వీరు చేసే సందడి మాములుగా లేదు. పిల్లలు యానిమల్స్ చూసి ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్రస్తుతం వీరి వైల్డ్ టూర్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక అల్లుఅర్జున్ త్వరలోనే పుష్ప 2 సినిమా చిత్రీకరణతో బిజీ కానున్నారు.