Allu Arjun: స్పీడ్ పెంచిన అల్లు అర్జున్.. ఒకేసారి రెండు సినిమాలు!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పూర్తిగా స్పీడ్‌ మోడ్‌లోకి షిఫ్ట్ అయ్యారు. ‘పుష్ప 2’తో వరల్డ్‌వైడ్‌గా 1800 కోట్ల గ్రాస్ రాబట్టి పాన్ ఇండియా స్థాయిని అందుకున్న బన్నీ, ఆ విజయం తర్వాత ఇంకొంత స్పీడ్ పెంచాలనే దిశగా ముందుకెళ్తున్నారు. గత ఐదేళ్లు రెండు సినిమాల కోసం కేటాయించడంతో ఆయనకు తక్కువగా సినిమాలు వచ్చినా, ఇప్పుడు ఆ లోటును పూరించేందుకు ఒకేసారి రెండు ప్రాజెక్టులకు రెడీ అయ్యారు.

ఇప్పటికే అట్లీ దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ డ్రామా కోసం బన్నీ కమిట్ అయిపోయారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. భారీ మేకింగ్, రౌడీ క్యారెక్టర్, పక్కా మాస్ ట్రీట్మెంట్‌తో ఇది పూర్తిగా మాస్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ రూపొందించనున్నారు. ఇదే సమయంలో త్రివిక్రమ్‌తో కలిసి చేస్తున్న మరో ప్రాజెక్టును కూడా అదే ఏడాది రెండో భాగంలో ప్రారంభించనున్నట్లు నిర్మాత నాగవంశీ కన్ఫర్మ్ చేశారు. అంటే బన్నీ బ్యాక్ టు బ్యాక్ మాస్ చిత్రాలతో వస్తున్నాడన్నమాట.

ఈసారి అల్లు అర్జున్ స్ట్రాటజీ బాగా క్లోజ్‌గా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఒకటి మాస్ కంటెంట్‌తో నార్త్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తే, త్రివిక్రమ్ మూవీలో ఆ డైలోగ్ మాజిక్, ఎమోషనల్ కంటెంట్‌తో సౌత్ ఆడియెన్స్‌ను ఎంగేజ్ చేయనున్నాడు. రెండు సినిమాలూ వేర్వేరు స్టయిల్స్‌లో ఉండబోతుండటం మరో హైలైట్. ఇదంతా చూస్తే బన్నీ తన కెరీర్‌ను మరింత పాన్ ఇండియా రేంజ్‌లో మలిచేందుకు గట్టి కసరత్తు చేస్తున్నాడనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఇక త్వరలోనే అట్లీ సినిమాపై అఫీషియల్ అప్డేట్ రానుంది. ఆ తరువాత మెల్లగా త్రివిక్రమ్ సినిమాను సెట్స్ పైకి తీసుకు రానున్నారు. ఏ రెండు సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రావచ్చు.