అల్లు అర్జున్ పుష్ప 2తో బిగ్ హిట్ అందుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఆయన ఎవరితో సినిమా చేస్తారు? ఎలాంటి కథను ఎంచుకుంటారు? అన్నది ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. మొదట అట్లీతో సినిమా ఖరారు అన్న వార్తలు వచ్చాయి. తర్వాత త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అధికారికంగా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటికీ ఈ సినిమాపై పూర్తి స్థాయి క్లారిటీ రాకపోవడంతో అభిమానుల్లో గందరగోళం కొనసాగుతోంది.
ఇటీవల నిర్మాత నాగవంశీ త్రివిక్రమ్ సినిమా గురించి స్పందించడంతో కొంత క్లారిటీ వచ్చినట్లే అనిపిస్తోంది. ఆయన ప్రకారం, ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో ప్రారంభమవుతుంది. అంటే, జూన్ తర్వాత ఏదో ఒక టైంలో మొదలయ్యే ఛాన్స్ ఉంది. అయితే, త్రివిక్రమ్ ఈ సారి పూర్తి స్థాయి కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. దాంతో స్క్రిప్ట్ విషయంలో మరికొంత సమయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో అట్లీ ప్రాజెక్ట్ మళ్లీ చర్చల్లోకి రావడం ఆసక్తిగా మారింది. బన్నీ, అట్లీ కాంబినేషన్ ఖచ్చితంగా జరుగుతుందన్న టాక్ ఉంది, కానీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతుండటంతో అది వెంటనే పట్టాలెక్కే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. మరోవైపు బన్నీ లైనప్‌లో సందీప్ రెడ్డి వంగా కూడా ఉన్నాడు. కానీ ఆ సినిమా 2027 తర్వాతే ఉండబోతోందని ఫిల్మ్ నగర్ టాక్.
ఇంతవరకు బన్నీ నుంచి అధికారిక ప్రకటన ఏదీ రాకపోవడంతో అభిమానులు ఇంకా క్లారిటీ కోసం వేచి చూస్తున్నారు. త్రివిక్రమ్ స్క్రిప్ట్ పూర్తయిన వెంటనే షూటింగ్ డేట్ ఫిక్స్ అవుతుందా? లేక బన్నీ మరో కొత్త ప్రాజెక్ట్ ప్రకటిస్తారా? అన్నది చూడాలి. మొత్తానికి, బన్నీ నెక్స్ట్ మూవీ ఎప్పుడొస్తుందనే దానిపై అభిమానుల ఉత్కంఠ మాత్రం ఇప్పటికీ కొనసాగుతోంది.