వైరల్ : తనని బ్లాక్ చేశాడంటున్న బన్నీ హీరోయిన్.!

టాలీవుడ్ లో ఏ కొత్త హీరో అయినా హీరోయిన్ అయినా కూడా వారి కెరీర్ లు ఎలా మొదలై ఎలా ముగుస్తాయో ఎవరికీ అర్ధం కానీ పరిస్థితి. కొందరు ఓ సినిమాతో హిట్ అందుకున్నప్పటికీ నెక్స్ట్ ఎందుకు మరో సినిమాలో కనిపించలేదు అంటే దానికి సమాధానం ఉండదు. అదే విధంగా అనేక సమీకరణాలు పలువు హీరోయిన్స్ కి ఉంటుంది.

అలా ఒకానొక సమయంలో ఓ సినిమాలో హీరో కన్నా హీరోయిన్ కి ఓ రేంజ్ లో హైప్ ఇస్తూ అసలు ఆమెని పోస్టర్స్ లో కూడా చూపించకుండా చేసిన సినిమా “వరుడు”. అయితే ఈ సినిమాతో టాలీవుడ్ కి భాను శ్రీ మెహ్రా పరిచయం అయ్యింది. కానీ అనుకోని విధంగా ఈ హీరోయిన్ భారీ ప్లాప్ ని ఈ సినిమాతో మూటగట్టుకుంది.

దీనితో అక్కడ నుంచి ఈమె మళ్ళీ టాలీవుడ్ లో కనిపించలేదు. ఇక ఇప్పుడు ఏం చేస్తుందో కూడా తెలీదు కానీ లేటెస్ట్ గా అయితే తనని మాత్రం అల్లు అర్జున్ ఎందుకు బ్లాక్ చేసాడో కూడా తెలియడం లేదని అంటుంది. మీరు ఏదైనా రూట్ లో ఇరుక్కుపోయినట్టు అనిపిస్తే అల్లు అర్జున్ తో వర్క్ చేసిన నేను ఇప్పటి వరకు ఎలాంటి వేరే సినిమా చెయ్యలేదు.

కానీ నా స్ట్రగుల్స్ చాలా తెలుసుకున్నాను చాలా హాస్యాన్ని పొందాను ఇపుడు ఇది కూడా అలాగే ఉంది అల్లు అర్జున్ నన్ను బ్లాక్ చేసాడు అంటూ ఓ స్క్రీన్ షాట్ ని షేర్ చేసింది. దీనితో ఇప్పుడు బన్నీ పై ఈమె పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారి వైరల్ అవుతుంది.