Allu Arjun: గని ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన బన్నీ..గజమాలతో స్వాగతం..!

Allu Arjun: ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న చిత్రం గని.ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది కానీ కొన్ని కారణాల వల్ల విడుదలకు ఆలస్యం అవుతూ వస్తోంది. మొత్తానికి ఏప్రిల్ 8న ఈచిత్రం విడుదల నిర్ణయించారు.అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ ఈ చిత్రానికి నిర్మాత. బాలీవుడ్ యంగ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడిగా నటిస్తోంది. ఏ సినిమా స్పోర్ట్స్ డ్రామా డ్రామా గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఒక బాక్సర్ గా కనిపించనున్నారు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నారని కూడా సమాచారం.

విడుదల సమయం దగ్గర పడుతుండటంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు. ప్రమోషన్ లో భాగంగా విశాఖపట్నంలో గ్రాండ్‌ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు.ఈ ఫ్రీ రిలీజ్ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరవుతున్నట్టు అందరికి తెలిసిందే. ప్రతిరోజు సాయంత్రం జరగాల్సిన వేడుకకు ముందుగానే వైజాగ్ ఎయిర్పోర్ట్ చేరుకున్నాడు అల్లు అర్జున్.

ఈ సందర్భంగా విశాఖలోని అల్లు అర్జున్ అభిమానులు, తమ అభిమాన హీరో వైజాగ్ చేరుకున్న సందర్భంగా అల్లు అర్జున్ ను గజమాలతో సత్కరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్లో తెగ హల్చల్ చేస్తోంది.