పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా హైదరాబాదులోని సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ విషయంపై అల్లు అర్జున్ స్పందిస్తూ క్షమాపణ చెప్పటంతో పాటు 25 లక్షల ఆర్థిక సాయం కూడా అందిస్తానని, ఆ కుటుంబానికి అండగా ఉంటానని తెలిపిన విషయం కూడా అందరికీ తెలిసిందే.
అయితే ఈ ఘటనపై పోలీసులు సరియైన బందోబస్తు కల్పించడంలో యాజమాన్యం విఫలమైందని థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ఇదే విషయంగా ముగ్గురిని అరెస్టు కూడా చేశారు. అయితే బన్నీ తమకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా థియేటర్ కి రావటం వలన సరైన బందోబస్తు ఇవ్వలేకపోయామని చెప్పారు థియేటర్ యాజమాన్యం. అయితే పోలీసులు అల్లు అర్జున్ పై కూడా బి ఎన్ ఎస్ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు నమోదు చేశారు.
అయితే తనపై నమోదైన కేసుని కొట్టివేయాలని అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం. అలాగే సంధ్య థియేటర్ దగ్గర జరిగిన ఘటన గురించి కూడా స్పందించారు. 3 సంవత్సరాల తరువాత తాను థియేటర్లో సినిమా చూడటానికి వెళ్లానని కానీ అభిమానులు ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో సినిమా పూర్తిగా చూడకుండానే వచ్చేసానని అయితే అక్కడ జరిగిన సంఘటన గురించి నాకు ఆలస్యంగా తెలిసిందని, ఆ షాక్ నుంచి కోలుకోవటానికి సమయం పట్టింది.
అందుకే నేను త్వరగా స్పందించలేకపోయాను అని వివరణ ఇచ్చిన అల్లు అర్జున్ ఆ కుటుంబానికి అండగా ఉంటానని కుటుంబానికి 25 లక్షలు సాయం ప్రకటించినట్లు కూడా చెప్పానని త్వరలోనే ఆ కుటుంబాన్ని కలుస్తానని కూడా చెప్పారు. మరి ఈ విషయంపై కోర్టు ఎలాంటి తీర్పు చూడాలి. అదే సమయంలో పుష్ప 2 సినిమా సక్సెస్ గురించి మాట్లాడుతూ క్రెడిట్ అంతా దర్శకుడిదే అని తనని తీసుకువెళ్లి ఎక్కడో కూర్చోబెట్టాడని చెప్పాడు అల్లు అర్జున్.