బిగ్ అప్డేట్ : అల్లు అర్జున్ అనిరుద్ కాంబినేషన్ పై క్రేజీ హింట్

ఇప్పుడు సౌత్ ఇండియా సినిమా దగ్గర మోస్ట్ హ్యాపెనింగ్ సంగీత దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా సెన్సేషనల్ మ్యూజిక్ దర్శకుడు అనిరుద్ రవిచందర్ అని చెప్పక్కర్లేదు. ఒక విక్రమ్, ఒక జైలర్, ఒక జవాన్ లాంటి సినిమాలతో ఓ రేంజ్ లో హైప్ ని తీసుకొస్తున్నాడు.

దీనితో అనిరుద్ ని తమ సినిమాకి కావాలని చాలా మంది హీరోస్ కానీ దర్శకులు కానీ ఆడియెన్స్ కూడా చాలా ఎక్కువ కోరుకుంటున్నారు. దీనితో ఓ రేంజ్ లో అనిరుద్ కి డిమాండ్ నెలకొనగా ఇప్పుడు అనిరుద్ మోస్ట్ బిజీ సంగీత దర్శకునిగా నిలిచాడు. అయితే ఈ లైనప్ లో ఇప్పుడు అనిరుద్ మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ పడబోతునట్టుగా ఆల్ మోస్ట్ ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యిపోయింది.

జవాన్ విషయంలో అల్లు అర్జున్ పెట్టిన పోస్ట్ కి గాను అనిరుద్ థాంక్స్ చెప్తూ రిప్లై చేయగా అనిరుద్ కి థాంక్స్ కాదమ్మా నాకు కూడా గ్రేట్ సాంగ్స్ కావాలని బన్నీ డిమాండ్ చేసాడు. దీనితో అనిరుద్ మళ్ళీ రెడీ…అంటూ క్రేజీ రిప్లై ఇచ్చాడు. దీనితో అనిరుద్ మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ల కాంబినేషన్ ఫిక్స్ అయ్యిపోయింది అని కన్ఫర్మ్ అయ్యింది.

దీనితో మాసివ్ కాంబినేషన్ ఎప్పుడు పడుతుందో ఏ దర్శకునితో పడుతుందో అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. మొత్తానికి అయితే బన్నీ ఇచ్చిన క్రేజీ హింట్ పాన్ ఇండియా మ్యూజిక్ లవర్స్ కి ఒక ఫీస్ట్ గా మారింది.
https://x.com/anirudhofficial/status/1702207115983733043?s=20