గురూజీని అల్లు అర్జున్ భలే లాగేశాడే.!

గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో సినిమా అంటే ఈ రోజుల్లో ఆషామాషీ వ్యవహారం కాదు. దర్శకుడిగా తాను తీసే సినిమాల కంటే, నిర్మాతగా తీస్తున్న సినిమాలు, పవన్ కళ్యాణ్ కోసం చేస్తున్న సినిమాలు (రచయితగా).. ఇలా ఎక్కువ ఫోకస్ అటు వైపునే వుంటోంది త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి.

‘గుంటూరు కారం’ పేరుతో మహేష్‌బాబుతో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా కేవలం, పవన్ కళ్యాణ్‌తో సినిమాల వల్ల ఆలస్యమవుతోందనీ, ఈ విషయంలో త్రివిక్రమ్‌పై మహేష్ గుర్రుగా వున్నాడనీ గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇదిలా వుంటే, త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమాకి సంబంధించి ప్రకటన రాబోతోంది. అసలు సీన్‌లోకి అల్లు అర్జున్ ఎలా వచ్చాడబ్బా.? ఇంకో యంగ్ హీరోతో త్రివిక్రమ్ సినిమా చేయాల్సి వుంది కదా.?

ఏమోగానీ, ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం అంత తేలిక కాదన్నది ఇన్‌సైడ్ సోర్సెస్ సమాచారం. కానీ, త్రివిక్రమ్ విషయంలో అల్లు అర్జున్ చాలా కాన్ఫిడెంట్‌గా వున్నాడట. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ‘జులాయి’, ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’, ‘అల వైకుంటపురములో’ సినిమాలొచ్చాయ్ ఇప్పటిదాకా.!