అల్లు అర్జున్ మామూలోడు కాదు సుమీ.!

స్టైలిష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. కేవలం సినీ నటుడు మాత్రమే కాదు.. అతనిలో మంచి బిజినెస్ మేన్ కూడా వున్నాడు.! తెలుగులో అల్లు అర్జున్ స్టామినా గురించి కొత్తగా చెప్పేదేముంది.? ‘పుష్ప’ సినిమాతో తన స్థాయిని పాన్ ఇండియా లెవల్‌కి పెంచేసుకున్నాడు అల్లు అర్జున్. ఈసారి అంతకు మించి.. అంటున్నాడు.

తాజాగా, బాలీవుడ్ హీరోలతో అల్లు అర్జున్ మమేకమవుతున్న తీరు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. తండ్రి అల్లు అరవింద్.. బాలీవుడ్‌లోనూ సినిమాలు నిర్మించిన దరిమిలా, ఆ పరిచయాల్ని.. తనకు అనుకూలంగా మార్చుకుంటున్నాడు అల్లు అర్జున్. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, తన తాజా సినిమా కోసం జూనియర్ ఎన్టీయార్‌ని పిక్ చేసుకున్న సంగతి తెలిసిందే. అదే హృతిక్ రోషన్‌తో నిన్న అల్లు అర్జున్, ఓ బాలీవుడ్ పార్టీలో రహస్య మంతనాలు జరిపాడట.

ఈ ఇద్దరి కాంబోలో ఓ సినిమా సెట్ అయ్యిందనేది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. ఔను, అల్లు అర్జున్ మామూలోడు కాదు.!