నా మెగాస్టార్‌తో అలా.. చిరుపై బన్నీ ప్రేమకు నిదర్శనమిదే!

Allu Arjun And Chiranjeevi In Niharika Konidela Sangeeth Event

నిహారిక పెళ్లి వేడుకలు ఎంత ఘనంగా జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. మరి కాసేపట్లో నిహారికకు చైతన్య మూడు ముళ్లు వేయనున్నాడు. ఆ తరువాత నిహారిక కొత్త జీవితం ఆరంభం కానుంది. నిహారిక పెళ్లి వేడుకలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది. ఇక మెగా ఈవెంట్ అంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మెగా హీరోలందరూ ఒకే చోట కలిస్తే వాతావరణం అంతా ఎలా సందడిగా మారుతుందో అందరికీ తెలిసిందే.

నిహారిక పెళ్లి సందర్భంగా గత ఐదారు రోజులుగా సెలెబ్రేషన్స్ రచ్చ రచ్చగా జరుగుతున్నాయి. రెండ్రోజుల నుంచి మన వాళ్లంతా ఉదయ్ పూర్‌లోని ఉదయ్ విలాస్ ప్యాలెస్‌లో రచ్చ చేస్తున్నారు. నిన్న మొన్న రాత్రి జరిగిన సంగీత్ ఈవెంట్‌లో మెగా హీరోలందరూ కాలు కదిపారు. నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ సెలెబ్రేషన్స్‌లో జాయిన్ అయ్యాడు. ఇక చిరంజీవి బన్నీ కలిసి బాగానే ముచ్చట్లు పెట్టుకుంటున్నారు.

Allu Arjun And Chiranjeevi In Niharika Konidela Sangeeth Event

మూమాలూగానే చిరంజీవి అంటే బన్నీకి వల్ల మాలిన ప్రేమ. చుట్టూ ఎంత మంది ఉన్నా సరే చిరంజీవిపై తన దృష్టిని కేంద్రీకరిస్తుంటాడు బన్నీ. అయితే నిన్నటి సంగీత్ ఈవెంట్‌లో చిరు,బన్నీ కలిసి స్టెప్పులు వేసినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు బన్నీ పోస్ట్ చేశాడు. చిరంజీవితో కలిసి స్టెప్పులు వేస్తున్న ఫోటోను షేర్ చేస్తూ.. నా మెగా స్టార్‌తో కలిసి కాలు కదుపుతున్నాను అంటూ సంగీత్ ఫోటోను షేర్ చేశాడు. నా మెగాస్టార్ అని అక్కడ బన్నీ చెప్పడంలోనే చిరుపై ఎంత ప్రేముందో ప్రకటించేశాడు.