17 ఏళ్ళు పట్టింది.. ఇక నేనేంటో చూపిస్తా: అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల.. వైకుంఠపురములో సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా విడుదలై ఏడాది కావొస్తున్న సందర్భంగా చిత్ర యూనిట్ రీ యూనియన్ వేడుకతో మరోసారి ఆనందాన్ని పంచుకుంది. ఇక వేడుకలో అల్లు అర్జున్ మాటలు అందరిని ఎంతగానో ఎట్రాక్ట్ చేశాయి.

Nara Rohit out of Allu Arjun's Pushpa

 

బన్నీ ఒక ఇండస్ట్రీ హిట్ కోసం ఎంతగా ఎదురుచూశాడో ఈ స్పీచ్ తో అర్ధమయ్యింది. ఇక 2020 ఇయర్ తనకు ఎంతమాత్రం బ్యాడ్ ఇయర్ కాదని చెప్పిన అల్లు అర్జున్ అల..వైకుంఠపురములో సినిమకంటే ముందు ఏడాదిన్నర ఇంట్లోనే కూర్చున్నానని అన్నాడు. అలాగే కోవిడ్ తరువాత కూడా ఇంట్లో ఉన్ననని అంటూ ఈ గ్యాప్ లో అల.. వైకుంఠపురములో మంచి ఎనర్జీని ఇచ్చిందని అన్నారు.

“ఇక కళ్యాణ్ గారికి ఏడు సినిమాల తరువాత ఖుషితో బిగ్గెస్ట్ హిట్ అందితే జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ఏడు సినిమాల తరువాత సింహాద్రి సినిమాతో ఇండస్ట్రీ హిట్ దక్కింది. చరణ్ కు రెండవ సినిమాతోనే గుర్తిండిపోయే సక్సెస్ వచ్చింది.. నాకు మాత్రం దాదాపు 17ఏళ్ళు పట్టింది. 20 సినిమాల తరువాత బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాను. ఇక ఇది నా మొదటి అడుగు ఇకపై నేనేంటో చూపిస్తాను” అని అల్లు అర్జున్ పుష్పను దృష్టిలో పెట్టుకొని మాట్లాడినట్లు అర్ధమయ్యింది. మరి ఆ పాన్ ఇండియా సినిమా ఏ రేంజ్ లో హిట్టవుతుందో చూడాలి.