అల్లు ఫ్యామిలీ సోషల్ మీడియాలో చేసే రచ్చ గురించి అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా అల్లు అయాన్, అల్లు అర్హలు సోషల్ మీడియాను షేక్ చేస్తుంటారు. మరీ ముఖ్యంగా అల్లు అర్హ ఎక్కడైనా కనిపిస్తే చాలు కెమెరా కళ్లన్నీ అర్హ వైపు తిరుగుతాయి. ఈ మధ్యేఅర్హ బర్త్ డేను పుష్ప సెట్‌లో గ్రాండ్‌గా ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలన్నీ వైరల్ అయ్యాయి. ఇక అర్హ ఈ మధ్యే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటు వేసి రచ్చ చేసింది.
అల్లు అర్హ పోలీంగ్ బూతులో చేసిన సందడి అందరికీ తెలిసిందే. అక్కడే గిరాగిరా తిరిగి అందర్నీ నవ్వించింది. అల్లు పిల్లలను చిచ్చర పిడుగులంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకుంటారు. వీరితో ఇక బన్నీ జాయిన్ అయితే ఆ రచ్చ వేరే లెవెల్‌లో ఉంటుంది. బన్నీ తాజాగా ఓ క్యూట్ ఫోటోను షేర్ చేశాడు. అందులో తల్లి కొడుకు ప్రేమకు బన్నీ ఇచ్చిన కాంప్లిమెంట్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది.
ఏ కొడుక్కి అయినా తల్లి ఒళ్లో పడుకోవడం, ఎదపై వాలిపోవడం కంటే మించిన అదృష్టం మరొకటి ఉండదు. తల్లి ఒళ్లో తల వాలిస్తే అదే స్వర్గంలా అనిపిస్తుంది. తాజాగా అల్లు అయాన్ కూడా తన తల్లి ఎదపై వాలి బజ్జున్నాడు. అలా తన సుకుమారుడు నిద్రిస్తుంటే.. బన్నీ ఆ దృశ్యాన్ని కెమెరాలో బంధించాడు. సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దానికి అదిరిపోయే కామెంట్ కూడా పెట్టాడు. హోమ్ స్వీట్ హోమ్ అంటూ తల్లి ఒడి గొప్పదని చెప్పకనే చెప్పేశాడు.