Allu Aravind : వరుణ్ తేజ్ నటించిన చిత్రం గని, దానికి ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది కానీ కొన్ని కారణాల వల్ల విడుదలకు ఆలస్యం అవుతూ వస్తోంది. మొత్తానికి ఏప్రిల్ 8న ఈచిత్రం విడుదల నిర్ణయించారు. ఈ చిత్రం కోసం వరుణ్ విదేశాల్లో బాక్సింగ్ కోచింగ్ కూడా తీసుకున్నాడు.
ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించగా, అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మించారు. బాలీవుడ్ యంగ్ బ్యూటీ సయీ మంజ్రేకర్ ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జోడిగా నటించారు. ఇక నదియా వరుణ్ తల్లిగా ఆకట్టుకుంది. శుక్రవారం నాడు విడుదలైన ఈ సినిమా పాత కథను కొత్తగా తీసారంటు ప్లాప్ టాక్ ను మూటగట్టుకొంది.
ఈ సినిమా చూసినప్పుడు అల్లు అరవింద్ ఈ సినిమా బాక్సఆఫీస్ వద్ద పెద్దగా ఆడదని, కొన్ని మార్పులు చేయడం మంచిదని సలహా ఇచ్చారట. కానీ ఈ సినిమాని నిర్మిస్తున్న అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు బాబీ మరియు డైరెక్టర్ కిరణ్ మాత్రం అల్లు అరవింద్ మాట ఖాతరు చేయలేదని తెలుస్తోంది. మళ్లీ ఈ సినిమాని రీషూట్ చేయటం ఇష్టంలేక అలానే విడుదల చేశారు దర్శక నిర్మాతలు. కానీ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే ఫ్లాప్ టాక్ ను అందుకుంది. డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీ నష్టాలు కలగడంతో తలలు పట్టుకుంటున్నారు.